ఈవారం జరగబోతున్న రెండు సంఘటనలు నానీకి చాలా స్ట్రస్ కలిగిస్తున్నట్లు స్వయుంగా నాని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మరో రెండు రోజులలో విదుదలకాబోతున్న ‘దేవదాస్’ సినిమాను ప్రమోట్ చేస్తూ నాని ఈకామెంట్స్ చేసాడు. ఈవారం తాను నాగార్జునతో కలిసినటిస్తున్న ‘దేవదాస్’ సినిమా విడుదల కావడంతోపాటు ఇదే వారాంతం తాను హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 2’ షో గ్రాండ్ ఫినాలె ఉండటంతో తన జీవితంలో ఎప్పుడు ఎదుర్కోని చాలా ఒత్తిడికి గురవుతున్నాను అంటూ నాని తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు. 
బిగ్‌బాస్ ముగిసిన తర్వాత కాశీకి వెళిపోతా
అంతేకాదు ‘బిగ్ బాస్ 2’ షో పూర్తి అయిన తరువాత ‘దేవదాస్’ ప్రమోషన్ కూడ పూర్తి అయిన తరువాత  తాను మనశ్శాంతి కోసం కాశి వెళ్ళబోతున్నట్లు ఈరోజు జరిగిన  'దేవదాస్' ప్రెస్‌ మీట్‌ లో నాని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇదే సందర్భంలో నాగార్జున గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు నాని. 
ఆయనతో నటించడమే నా అదృష్టం
నాగార్జునతో కలసి నటించడం తన అదృష్టం అని అంటూ షూటింగ్ స్పాట్ లో నాగార్జున తనతో ఎంతో సన్నిహితంగా ఉండటమే కాకుండా తనకు నటన విషయంలో ఎన్నో సలహాలు ఇచ్చిన విషయాన్ని బయట పెట్టాడు నాని. అంతేకాదు నాగార్జున ఏవిషయం అయినా ఓపెన్ గా మాట్లాడుతాడని ఇగో లేని నాగార్జునతో నటించడం చాల సులువు అంటూ నాగ్ పై ప్రశంసలు కురిపించాడు నాని. 
bigg boss 2 telugu hosted by nani
ఈఆదివారం ‘బిగ్ బాస్ 2’ విజేతను నిర్ణయించే రోజు కావడంతో ఆచివరి రోజు షోను ఎటువంటి ఉద్వేగాలకు తావు ఇవ్వకుండా చాల చాకచక్యంగా నిర్వహించవలసిన బాధ్యత నాని పై ఉంది. ఈ క్లైమాక్స్ షోలో నాని ఏచిన్న పొరపాటు చేసినా అది బుల్లితెర ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయిపోతుంది. ‘బిగ్ బాస్ 2’ విజేతకు సంబంధించి ఇప్పటికే చాల అంచనాలు ఉన్న నేపధ్యంలో దానికి భిన్నంగా ఏదైనా నిర్ణయాలు జరిగితే నాని పై తీవ్ర విమర్శలు రావడం ఖాయం. అందుకే అంత టెన్షన్ పడుతున్నాడు అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: