తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మంచు మనోజ్.  అయితే ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకు పోతున్నారు.  కాకపోతే మంచు మనోజ్ మాత్రం మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు.  అయితే వీరిద్దరి పుట్టిన రోజు ఒక్కటే..భార్యల పేరు కూడా ఒక్కటే కావడం విశేషం. ఇక మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటాడు.  ఈ మద్య మిర్యాల గూడలో ప్రణయ్ హత్య విషయంలో బాగా రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే. 

అంతే కాదు లు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. స్నేహం కోసం ఏమి చేయడానికైనా మనోజ్ వెనుకాడడు. ఇటీవల నందమూరి హరికృష్ణ మరణం సమయంలో కూడా కల్యాణ్ రామ్, తారక్ లకు మనోజ్ అండగా నిలిచిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.  ఇక తారక్ కోసం చిన్నప్పుడే మనోజ్ ఓ సాహసం చేశాడట. 

చిన్నతనంలో తారక్ ని ఎవరో ఆకతాయి కొట్టాడట..విషయం మంచు మనోజ్ కి తెలిసి వెంటనే అతని వద్దకు వెళ్లి గొడవ పెట్టుకొని చెయ్యి విరిచి మరీ వచ్చాడట. ఈ కథ ఏందో పూర్తిగా చెప్పాలని ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా మనోజ్ ను కోరాడు. దీనికి సమాధానంగా, 'తారకే నే అడుగు. నా కంటే అతనే బాగా చెబుతాడు' అని రిప్టై ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: