జూనియర్ ఎన్టీఆర్ తన తాత నందమూరి తారక రామారావు వారసుడుగా రాజకీయాలలోకి వచ్చి రాణించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. జూనియర్ కు కూడ రాజకీయాలలో రాణించాలని ఆసక్తి ఉన్నా పరిస్థుతులు పూర్తిగా అనుకూలించక పోవడంతో సరైన సమయం గురించి తారక్ ఎదురు చూస్తున్నాడు.
Teaser: NTR's Aravinda Sametha
ఇలాంటి పరిస్థుతులలో జూనియర్ అభిమానులు కలలు కంటున్న రాజకీయ కలలను తీర్చే సినిమాగా ‘అరవింద సమేత’ లో కొన్ని సీన్స్ ఉంటాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఈ చిత్ర కథకు సంబంధించి ఈమూవీలో స్థానిక ఎన్నికల ఎపిసోడ్ ఉండబోతుందట. ఆ ఎన్నికల ఎపిసోడ్ ‘అరవింద సమేత’ కు హైలైట్ అవుతుందని సమాచారం. 
జగపతి బాబు డైలాగ్స్
ఈ ఎన్నికల ప్రచారం సన్నివేశాలలో జూనియర్ తన వర్గం వారికోసం ఈమూవీలో ప్రచారం చేస్తాడట. ఆసీన్స్ లో వచ్చే డైలాగ్ త్రివిక్రమ్ మార్క్ ను కలిగి ఉంటాయని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ ఎన్నికల సీన్ ‘అరవింద సమేత’ లో కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. 
 ఎన్టీఆర్ స్టైల్
రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జూనియర్ చేత ప్రచారం చేయిస్తే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడతాయి అని తెలుగుదేశం అధినాయకత్వం కూడ జూనియర్ ను మళ్ళీ దగ్గరకు తీసుకుంటున్న నేపధ్యంలో ‘అరవింద సమేత’ లో ఈ సీన్ క్లిక్ అయితే జూనియర్ రాబోయే ఎన్నికల ప్రచారం చేయడం ఖాయం అనుకోవాలి. ఏమైనా డైలాగ్స్ ను చాల పవర్ ఫుల్ గా చెప్పే జూనియర్ నోటి వెంట రాజకీయ డైలాగులు వస్తే అది ‘అరవింద సమేత’ రికార్డులకు ఎంతో సహకరిస్తుంది అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు..  



మరింత సమాచారం తెలుసుకోండి: