నిన్నవిడుదలైన ‘దేవదాస్’ మూవీలో వెన్నెల కిషోర్ కు అవమానం జరిగింది అంటూ అతడి అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ఈమధ్య కాలంలో చాలా సినిమాలు వెన్నెల కిషోర్ కామెడీ వల్ల సూపర్ హిట్ అయ్యాయి. ‘గీత గోవిందం’ ‘చి.ల.సౌ’ సక్సస్ లో వెన్నెల కిషోర్ కామెడీ ఏవిధంగా నవ్వించిందో అందరికీ తెలిసిన విషయమే.
Mahesh Babu, Mahesh Babu phone number, Superstar Mahesh Babu phone number, Vennela Kishore Interview, Comedian Vennela Kishore Tollywood
ఇలాంటి పరిస్థుతులలో నిన్న విడుదలైన ‘దేవదాస్’ మూవీలోని వెన్నెల కిషోర్ పాత్రను చూసి ఆమూవీని చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఈమూవీలో ఇతడి పాత్ర సినిమా నిడివి ఎక్కువైంది అని తగ్గించివేసారో లేక అతడి సీన్స్ విషయంలో శ్రద్ద తీసుకోలేదో తెలియకపోయినా ‘దేవదాస్’ మూవీలో కిశోర్ ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రను పోషించడం చాలామందికి షాక్ ఇచ్చింది.
vennela kishore
ముఖ్యంగా ఈమధ్య కాలంలో ఓవర్సీస్ ప్రేక్షకులకు అభిమాన కమెడియన్ గా కిషోర్ మారిపోయాడు. ఈపరిస్థుతులలో నిన్నటి ‘దేవదాస్’ లోని అతడి పాత్రను చూసి ఓవర్సీస్ ప్రేక్షకులు కూడ షాక్ అయినట్లు సమాచారం. దీనితో ఏమాత్రం ప్రాధాన్యత లేని ఇలాంటి పాత్రను తమ అభిమాన కమెడియన్ ఎందుకు పోషించాడు అంటూ కిషోర్ అభిమానులు బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
Vennela Kishore
ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన ‘దేవదాస్’ కు డివైడ్ టాక్ రావడంతో 38 కోట్ల స్థాయిలో బిజినెస్ జరిగిన ఈమూవీ బయ్యర్ల పరిస్థితి ఏమిటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంచి ఆహ్లాదకరమైన సీన్స్ కొన్ని కామెడీ దృశ్యాలు పేరు మోసిన నటీనటులు ఈమూవీలో ఉన్నా మంచి కమర్షియల్‌ వంటకానికి అవసరమైన పదార్థాలు మసాలాలు అన్నీ సమకూరినా దానిని తయారు చేసేప్పుడు ఏదిఎంత వేయాలనే విషయంలో సమతుల్యం పాటించకపోతే ఆవంట ఎలా రుచుగా ఉండదో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ‘దేవదాస్’ లో అన్నీ ఉన్నా ఎదో తెలియని లోటుతో సగటు ప్రేక్షకుడు ఈమూవీ ధియేటర్ల నుండి బయటకు వస్తూ ఉండటంతో డివైడ్ టాక్ తోనే ‘దేవదాస్’ సరిపెట్టుకోవలసి వచ్చింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: