తెలుగు ఇండస్ట్రీలో ఒకటీ రెండు చిత్రాలతోనే తన ఇమేజ్ అమాంతం పెంచుకున్న హీరో విజయ్ దేవరకొండ.  పెళ్లిచూపులు తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో ఎక్కడ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు ఈ యంగ్ హీరో. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ‘గీతాగోవిందం’ చిత్రంతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.  స్టార్ హీరోలకే సాధ్యం కాని ఈ టార్గెట్ మూడో సినిమాతోనే రికార్డు క్రియేట్ చేయడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ చిన్న, పెద్ద నిర్మాతలకు వరంగా మారాడు.  ఇక వారసత్వపు హీరోల విషయం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 


ఇండస్ట్రీలో కాస్తో..కూస్తో పేరు వస్తే వారి బంధువులకు కూడా చిన్న చాన్స్ ఇవ్వడం జరుగుతుంది.  ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను పరిశ్రమకు పరిచయం చేయాలని నిర్ణయించుకుని ముహూర్తం ఫిక్స్ చేశాడు. సీనియర్‌ హీరో రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది.


తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్‌ 10న ప్రారంభం కానుంది. షార్ట్‌ ఫిలింస్‌తో సత్తా చాటిన కేవీఆర్‌ మహేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే పలు షార్ట్‌ ఫిలింస్‌ తీసి, తానేంటో నిరూపించుకున్న కేవీఆర్‌ మహేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, దగ్గుబాటి సురేష్‌ బాబు సమర్పణలో యష్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ లు దీనికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: