జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ చేసిన రగడపై  ఎట్టకేలకు నోరు విప్పాడు. వచ్చేవారం విడుదల కాబోతున్న ‘నోటా’ ను ప్రమోట్ చేస్తూ విజయ్ ఈసంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక స్టార్ హీరో సినిమాతో తన మూవీ రిలీజ్ చేస్తే దానిఫలితం ఎలాఉంటుందో తనకు తెలుసు అనిఅంటూ తన ఫిల్మ్ బడ్జెట్‌తో పోలిస్తే ‘అరవింద సమేత’ బడ్జెట్ పదిరెట్లు ఎక్కువ అన్నవిషయాలు తనకు పూర్తిగా తెలుసు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
Vijay Devarakonda
అంతేకాదు సినిమాతో సంబంధం లేకుండా కేవలం జూనియర్ ఉంటే ధియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఎందరో ఉన్నారని అలాంటి సినిమాతో తన ‘నోటా’ ను రిలీజ్ చేస్తే నష్టపోయేది తనసినిమా మాత్రమే అన్నజ్ఞానం తనకు ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు విజయ్. పదిరోజుల కిందట సోషల్‌ మీడియా వేదికగా ‘నోటా’  ‘అరవింద సమేత’ సినిమాలవిడుదల తేదీలపై వచ్చిన వార్తలకు జూనియర్ అభిమానులకు వచ్చిన ఆగ్రహాన్ని ప్రస్తావిస్తూ విజయ్ ఈకామెంట్స్ చేసాడు. 
vijay devarakonda will campaign on trs
ఇక్కడే మరొక ట్విస్ట్ ఇస్తూ ఈసంచలన నటుడు అక్టోబర్ 10నుంచి దసరా సెలవులు రావడంతో తన ‘నోటా’ సినిమాని విడుదల చేయాలనే ఆలోచన వచ్చిందని అయితే ఆలోచన నుండి విరమించు కోవడానికి గలకారణం జూనియర్ సినిమాతో పోలిస్తే తన సినిమాకు ధియేటర్లు దక్కవు అనే ఆలోచన కూడ ఉంది అంటూ కేవలం తాను జూనియర్ మ్యానియాకు మాత్రమే భయపడలేదు అన్న పరోక్ష సంకేతాలు ఇస్తున్నాడు ఈక్రేజీ హీరో. అంతేకాదు టాలీవుడ్‌ లో ఒకసినిమా 100కోట్ల బిజినెస్ చేస్తే ఆఫిల్మ్‌ని దాదాపు కోటి 20లక్షల మంది చూసినట్లు లెక్క అనిఅంటూ అంత హిట్ అయిన సినిమాను కూడ చూడని వారు మన ఇరురాష్ట్రాలలో ఇంకా 8కోట్ల మందివరకు ఉంటారు అంటూ మరో విధంగా టాప్ హీరోల స్టామినాను కేలికాడు.  
Vijay Devarakonda to team up with sensible director Kranthi Madhav
ఇకతన లేటెస్ట్ సినిమా ‘నోటా’ గురించి మాట్లాడుతూ ఈమూవీకి తాను ‘ఎ’ సర్టిఫికేట్ వస్తుంది అనుకుంటే తమిళనాడు సెన్సార్ బోర్డ్ ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ ఇవ్వడంపై తన ఆశ్చర్యాన్ని వ్యక్త పరిచాడు. తాను ‘ఎ’ సర్టిఫికెట్ రావాలని కోరుకున్నా అక్కడి సెన్సార్ బోర్డు మాత్రం ‘యు’ సర్టిఫికేట్ తన ‘నోటా’ కు ఇచ్చింది అని చెపుతూ మరి తనప్రియమైన తెలుగు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తుందో చూడాలని అంటూ కామెంట్స్ చేసాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా విషయంలో లిప్ లాక్ సీన్స్ గురించి విపరీతంగా పట్టించుకున్న తెలుగు సెన్సార్ బోర్డ్ అలాంటి విషయాలు ‘నోటా’ లో కూడ ఉన్నా కోలీవుడ్ సెన్సార్ పట్టించుకోలేదు అంటూ మనతెలుగు సెన్సార్ బోర్డ్ కు చురకలు అంటిస్తున్నాడు విజయ్. తాను మాట్లాడే ప్రతిమాటలోనూ చాలవిభిన్నంగా కనిపిస్తున్న విజయ్ తీరు ఇప్పటికి కాకపోయినా ఎప్పటికైనా టాప్ హీరోలకు కలవర పెట్టేవిధంగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: