మెగా అభిమానులు తమ అభిమాన హీరో రామ్ చరణ్ ఒక విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో చరణ్ అభిమానులు చేస్తున్న కామెంట్స్ చాలందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రస్తుతం మెగా అభిమానుల చర్చలలో మొన్న విడుదలైన ‘నవాబ్’ సినిమా హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి దర్శకుడు మణి రత్నం ఈమూవీలో రామ్ చరణ్ ను శింభు పాత్రలో నటింపచేయాలని ప్రయత్నించాడు. 
Mani Ratnam's Nawab Movie Twitter Review
ఈమూవీకి ‘దేవదాస్’ తో పోల్చుకుంటే మంచి టాక్ రావడంతో పాటు శింబు పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపధ్యంలో ఈ అవకాశాన్ని చరణ్ అనవసరంగా వదులుకున్నాడు అంటూ  రచ్చ చేస్తున్నారు మెగా అభిమానులు. అంతేకాదు ఈ సినిమాలో నటించి ఉంటే చెర్రీకి మంచి పేరొచ్చి ఉండేదని మెగా అభిమానుల అభిప్రాయం. 

వాస్తవానికి ఈసినిమాను మణిరత్నం తెలుగు తమిళ భాషలలో చాల భారీ స్థాయిలో తీయాలని ఆలోచించాడు. అందుకోసమే ఈమూవీ ప్రాజెక్ట్ లో చరణ్ ఉంటే ఈమూవీకి క్రేజ్ ఏర్పడటమే కాకుండా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని మణిరత్నం ఎన్నో విధాలుగా చరణ్ కోసం ప్రయత్నించాడు. 
mani ratnam's nawab telugu movie second trailer released
అయితే అప్పటికే చరణ్ ‘రంగస్థలం’ మూవీతో బిజీగా ఉండటంతో పాటు దీనికితోడు బోయపాటి సినిమాకు కమిట్ అయిన నేపధ్యంలో మణిరత్నం సినిమా పై చరణ్ ఆసక్తి కనపరచలేదు. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ‘నవాబ్’ మూవీలోని శింభు పాత్రలో చరణ్ నటించి ఉంటె ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఎప్పటి నుంచో కోలీవుడ్ ఎంట్రీ గురించి కలలు కంటున్న చరణ్ కు మంచి అవకాశం దక్కేది అని మెగా అభిమానుల వాదన..  


మరింత సమాచారం తెలుసుకోండి: