తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పటి వరకు తీసిన చిత్రాలు ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలిసిందే.  జెంటిల్ మెన్ నుంచి రాబోయో రోబో 2.0 వరకు ఆయన చిత్రాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.  ముఖ్యంగా శంకర్ తన ప్రతి చిత్రంలో సోషల్ మెసేజ్ తప్పకుండా ఉంచుతారు.  ఈ నేపథ్యంలో లంచం తీసుకోవడం..ఇవ్వడం తప్పు అని ‘భారతీయుడు’, విద్యను డబ్బుకు అమ్ముకునే రాజకీయ నేతలను దోచుకునే పాత్రలో ‘జెంటిల్ మాన్’,  కార్పోరేట్ కళాశాలలు డబ్బున్న వాళ్లకే కాదు సామాన్యులకు సైతం అందే విధంగా చూసే ఓ ఎన్ ఆర్ ఐ పాత్రలో రజినీకాంత్ నటించి ‘శివాజీ’ చిత్రం ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దారు శంకర్. 

భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ కి విపరీతమైన క్రేజ్ వుంది. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యతను ఇచ్చినా, బలమైన కథాకథనాలు ఉండేలా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. ఈ సినిమా తరువాత ఆయన 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చకచకా జరిగిపోతూనే వున్నాయి. 

ఇక ఈ సినిమా తరువాత ఆయన మరో భారీ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి ఇప్పటి నుంచే రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు.  త్వరలో శంకర్ మరో భారీ సైన్స్ ఫిక్షన్  చిత్రం తీయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కూడా వందలకోట్ల బడ్జెట్ లోనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.  అయితే ఈ చిత్రానికి సంబంధించిన హీరో, హీరోయిన్ల పేరు త్వరలో అఫిషియెల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు కోలీవుడ్ టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: