మరో మూడు రోజులలో విడుదలకాబోతున్న ‘నోటా’ తెలుగు వర్షన్ కు సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి అని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీ తమిళ వర్షన్ కు ఇప్పటికే తమిళనాడులో సెన్సార్ కు సంబంధించి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ రావడంతో హైదరాబాద్ సెన్సార్ లో కూడ అటువంటి పరిస్థితి ఉంటుందని ఆశించారు. అయితే దీనికి భిన్నంగా మన సెన్సార్ వర్గాలు ఈమూవీలోని కొన్ని డైలాగుల విషయంలో తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. 
NOTA Movie
ముఖ్యంగా ఈసినిమాలో తరుచు విజయ్ దేవరకొండ నోటివెంట వచ్చిన ప్రమాణం అన్న పదానికి సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరాలు చెప్పినట్లు టాక్. ఈమూవీ దర్శకుడుకి తమిళ నేపధ్యం ఎక్కువగా ఉండటంతో హీరో విజయ్ దేవరకొండ స్వయంగా రంగంలోకి దిగి ఈమూవీలోని డైలాగుల విషయంలో వస్తున్న అభ్యంతరాలకు తెలుగులో పూర్తి వివరణ సెన్సార్ బోర్డ్ సభ్యులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. 
Mind Blowing Pre Release Business Stats Of NOTA Movie
అయితే ఈవివరణకు కూడ సెన్సార్ వర్గాలు అంగీకరించక పోవడంతో సెన్సార్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన డైలాగ్స్ వచ్చే సమయంలో ‘మ్యూట్’ చేస్తామని వివరణ ఇవ్వడంతో అలా ఆ అభ్యంతరకర డైలాగ్స్ అన్నీ మ్యూట్ చేసి మరొక కాపీని తీసుకు రావలసిందిగా ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు ఈసినిమాలోని కొన్ని సీన్స్ తెలంగాణాలోని ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాయని అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయ్యేవరకు ఈమూవీని విడుదల చేయవద్దు అంటూ కొందరు ఎన్నికల కమీషన్ కు పిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
NOTA
అంతేకాకుండా ఈమూవీ విడుదలకు ముందు ఎలక్షన్ కమీషన్ సభ్యులు అదేవిధంగా హోమ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈమూవీని చూసిన తరువాత మాత్రమే విడుదల చేయాలని కోరుతూ కొందరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వివాదాలు పెరిగే కొద్ది విజయ్ దేవరకొండకు అదృష్టం విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు అదే పరిస్థితి ‘నోటా’ విషయంలో కూడ రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: