మహాత్మాగాంధీ పుట్టిన భారతదేశంలో ఇప్పుడు గాంధీ ప్రవచించిన గాంధేయతత్వం ఇప్పుడు ఎవరికీ పనికిరాని విషయం. గాంధీజీ తన జీవిత కాలంలో చెప్పిన అహింసా స్వాలంబన సర్వోదయ సూత్రాలను ఈనాటి భారతదేశం ఏనాడో మరిచిపోయింది. కేవలం గాంధీ పుట్టినరోజునాడు గాంధీ వర్ధంతి రోజునాడు మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ వద్దకు వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించడంతో మన నేతలు సరిపుచ్చుతూ ఉంటే గాంధీ జయంతి రోజున వచ్చిన నేషనల్ హాలీడేను ఎలా సెలిబ్రేట్ చేసుకోవాలి అన్న ఆలోచనలలో నేటితరం ఉంది అంటే మహాత్మాగాంధీని కేవలం కరెన్సీ నోట్ల మీద బొమ్మగా మాత్రమే మహాత్ముడు మిగిలిపోయాడు అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు. 
Mahatma Gandhi
పరుల బాధను తన బాధగా భావించగల వారే నిజమైన మహనీయులు అని మహాత్మాగాంధీ అభిప్రాయం. అయితే ఆ మహాత్ముడి మాటలను మనదేశంలోని చాలామంది మరిచిపోయినా గాంధీ 150వ జయంతి వేడుకలు కేవలం మన దేశంలోనే కాకుండా ఎంతో అభివృద్ధి చెందిన సింగపూర్ లో ఈరోజు మహాత్ముడి పుట్టినరోజును ‘సంపూర్ణ పారిశుద్ధ్యం’ రోజుగా సింగపూర్ ప్రభుత్వ అధినేత లీ సియాస్ లూంగ్ ఆదేశంలో నేడు జరుపుకుంటున్నారు అంటే గాంధీ మహాత్ముడుకి మనదేశంలో కంటే విదేశాలలో ఎంత గుర్తింపు ఉందో అర్ధం ఉంది. 
Mahatma Gandhi,Suffragettes,Mohandas K. Gandhi
‘మహాత్మాగాంధీ నాకు నిజమైన హీరో నాకు స్ఫూర్తి ప్రధాత’ అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా చెప్పారు అంటే మహాత్ముడి జీవితం ఒబామాను ఏవిధంగా ప్రభావితం చేసిందో అర్ధం అవుతుంది. నెదర్లాండ్స్ లో ఈరోజు మహాత్ముడి జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకోవడమే కాకుండా నెదర్లాండ్స్ లోని హేగ్ లో 1000 మందితో ప్రతిసంవత్సరం గాంధీ జయంతి రోజున ‘గాంధీ మార్చ్’ పేరుతో ఒక పీస్ మార్చ్ జరపడమే కాకుండా ‘మహాత్ముడు’ ని అనుసరిద్దాం అన్న లోగోతో నెదర్లాండ్స్ లో అనేక గార్మెంట్ కంపెనీలు గాంధీ లోగోతో టి.షర్టులను విడుదల చేసాయి అంటే గాంధీకి ఆదేశం ఇస్తున్న గౌరవం అర్ధం అవుతుంది. 
Gandhi Jayanti 2017 Highlights: PM Narendra Modi Addresses Nation On Swachhata
ఇక ఇది చాలదు అన్నట్లుగా మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ట్విటర్ సంస్థ రూపొందించిన ప్రత్యేకమైన గాంధీజీ ఇమోజీని నేడు ఆవిష్కరించారు అంటే గాంధీకి నేడు యువత ఎక్కువగా ఇష్టపడే ట్విటర్ గాంధీకి ఇచ్చిన గౌరవం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే అలాంటి మహాత్ముడి 150వ జయంతి వేడుకలు మనదేశంలో కూడ జరుగుతూ ఉన్నా కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం అయిపోతూ గాంధీ జయంతిని ఒక మొక్కుబడి రోజుగా జరుపుకుంటున్న నేపధ్యంలో బాపూ చూపించిన బాటలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి గాంధీ తత్వమే భవితవ్యం అంటూ మన ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఎంత వరకు 130 కోట్ల భారతజాతి అనుసరిస్తుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: