భారత దేశంలో స్వాతంత్రం ఎంతో మంది మహావీరులు, వీర వనితలు పోరాడిన విషయం తెలిసిందే.  తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భ్రిటీష్ చెర నుంచి భరత మాత సంకెళ్లు తెంచేందుకు ఎన్నో యుద్దాలు చేశారు.  అలాంటి వీరయోధుల్లో ఒకరైన ఝాన్సీ లక్ష్మీభాయి గురించి తెలియని వారు ఉండరు.  ఇక మహిళలను ఝాన్సీరాణితో పోల్చుతారు..ఆమెలోని పోరాట స్ఫూర్తి మహిళల్లో ఉండాలని అంటారు.   బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మణికర్ణిక’.


పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.   ఇప్పటికే పలు వివాదాలతో వార్తల్లో ఉంటున్న ఈ చిత్రం ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు. బిగ్‌ బి అమితాబ్ వాయిస్‌ ఓవర్‌తో రూపొందించిన టీజర్‌ ఆసక్తికరంగా ఉంది.  "తన దేశం కోసం ఎన్నో యుద్ధాలు చేసింది" అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వినిపిస్తూ ప్రారంభమయ్యే ఈ టీజర్ ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తోంది.


బ్రిటిషర్ల జాతీయ జెండాను తన ఖడ్గంతో రాణి ఝాన్సీ లక్ష్మీ బాయి చీలుస్తున్న దృశ్యం హైలైట్ గా నిలిచిన టీజర్ లో పలు పోరాట సన్నివేశాలను హృదయా నికి హత్తుకునే విధంగా చిత్రీకరించారని తెలుస్తోంది. కాగా, ఇటీవలే ఈ చిత్రం దర్శకత్వం పై వస్తోన్న అనేక రూమర్లకు చిత్ర నిర్మాతలు చెక్ పెట్టారు. మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కించింది క్రిషే అని.. కాబట్టి ఈ చిత్రానికి ఆయనే డైరెక్టర్ అని నిర్మాతలు స్పష్టం చేశారు.


జీ స్టూడియోస్ మరియు కమల్ జైన్ సంయుక్తంగా నిశాంత్ పిట్టీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 25 న మణికర్ణిక ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. "ఇతిహాసాన్ని మార్చిన ఓ రాణి కథ. ఆమె ఇచ్చిన ఝలక్‌ చూడండి" అంటూ కంగనా, ఈ టీజర్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: