తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్.  ఆ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా పేరు తీసుకురాకపోయినా..రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ చిత్రంతో ఒక్కసారే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఆ తర్వాత వరుసగా మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి లాంటి చిత్రాలతో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్నాడు.  ఇక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’సీరిస్ తో ఏకంగా జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ నటించబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై టాలీవుడ్‌లోనే కాదు  దేశవ్యాప్తంగా అన్నిమూవీ ఇండస్ట్రీస్ వాళ్లు ఎదురు చూస్తున్నారు.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహూ’.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.  బాలీవుడ్ బ్యూటీ శద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీకి కొబ్బరికాయ కొట్టాడు. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది.

తాజాగా ప్రభాస్ కూడా ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ మూవీని 1970,80 పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఆ కాలానికి సంబంధించిన లుక్‌లోనే ప్రభాస్ కనిపిస్తున్నాడు.  తాజాగా షూటింగ్‌లో లొకేషన్‌లో స్థానిక అధికారులతో ప్రభాస్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: