‘అరవింద సమేత’ ట్రైలర్ ఒక ప్రభంజనంలా మారి యూట్యూబ్ లో క్రియేట్ చేస్తున్న రికార్డులు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఈ ట్రైలర్ కు కేవలం 20 గంటలలో 6 మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా 3 లక్షల లైక్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది. 

ముఖ్యంగా ఈ ట్రైలర్ కట్ చేసే విధానంలో త్రివిక్రమ్ అనుసరించిన వ్యూహాలు యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. దీనితో ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో ‘అరవింద సమేత’ కు ఇక ఎదురు లేదు. సామాన్యంగా ఒక టాప్ హీరో సినిమాలకు సంబంధించిన ట్రైలర్ ను ఆ టాప్ హీరో అభిమానులు విపరీతంగా ప్రమోట్ చేస్తూ లైక్స్ కొడుతూ ఉంటారు. 
Aravindha Sametha Theatrical Trailer
అయితే దీనికి భిన్నంగా ‘అరవింద సమేత’ ట్రైలర్ ను మెచ్చుకుంటూ పవన్ అభిమానులు కామెంట్స్ పెడుతూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ‘పవర్ స్టార్ ఫ్యాన్‌గా చెబుతున్నా ఎన్టీఆర్ సూపర్’ అంటూ కొందరు ‘ఆల్ ద బెస్ట్ ఎన్టీఆర్ గారు ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్’ అంటూ మరికొందరు ఈ ట్రైలర్ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ఈ కామెంట్స్ అన్నీ నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులే పెడుతున్నారా లేదంటే పవన్ అభిమానుల పేరుతో మరెవ్వరైనా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 
Aravinda Sametha Trailer Released - Sakshi
వాస్తవానికి రానున్న ఆంద్రప్రదేశ్ ఎన్నికల సమరంలో పవన్ కళ్యాణ్ కు ధీటుగా కౌంటర్ ఇవ్వడానికి జూనియర్ ను ఎన్నికల ప్రచారంలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపధ్యంలో తమ పవర్ స్టార్ కు జూనియర్ నుండి విమర్శలు రాకుండా తప్పించడానికి వ్యూహాత్మకంగా కొందరు పవన్ వీరాభిమానులు ఇలా ఆలోచించి ‘అరవింద సమేత’ ట్రైలర్ ను పొగుడ్తూ కామెంట్స్ పెట్టి జూనియర్ ను ముందు నుంచే బుట్టలో పెడుతున్నారా అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఏమైనా పవన్ అభిమానులు కూడ ‘అరవింద సమేత’ కు తోడైతే అది రికార్డులు క్రియేట్ చేయడం చాల సులభం..  


మరింత సమాచారం తెలుసుకోండి: