ప్రస్థుతం యూత్ కు ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ సడన్ గా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ‘కింగ్ ఆఫ్ ది హిల్స్’ పేరిట తన సొంత బ్యానర్ ను ప్రకటించడం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈబ్యానర్ తోనే రేపు మన తెలుగురాష్ట్రాలలో ‘నోటా’ విడుదల కాబోతోంది. వాస్తవానికి విజయ్ సమీప బంధువు ‘బిగ్ టెన్ మూవీస్’ పేరిట ఇప్పటికే ఒక ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టి ‘డియర్ కామ్రేడ్’ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 
Vijay Devarakonda
అయితే ఇదిచాలదు అన్నట్లుగా విజయ్ ఇప్పుడు స్వయంగా ఒకనిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన విషయం పై అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు విజయ్ ఇక నుండి తానునటించే సినిమాలలో పారితోషికంతో పాటు లాభాలలో వాటా తీసుకునే ఆలోచనలతో ఇలా సొంతప్రొడక్షన్ హౌస్ వైపు అడుగులు వేస్తున్నట్లు టాక్. మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించి పారితోషికంతో పాటు ఆమూవీకి జరిగిన బిజినెస్ లో వాటాను కూడ తీసుకుంటున్నట్లుగా మహేష్ సూపర్ స్టార్ ఇమేజ్ పై కన్నేసిన విజయ్ మహేష్ వ్యూహాలను అనుసరించడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 
Describing Dwaraka, Vijay says that it is the story of a thief, Erra Seenu.
విజయ్ నటించిన సినిమాల సక్సస్ కన్నా రోజురోజుకు పెరిగిపోతున్న అతడి సూపర్ స్టార్ ఇమేజ్ ప్రస్తుతం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. రజనీకాంత్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానులలో ఉండే మ్యానియా విజయ్ అభిమానులలో కనిపిస్తూ ఉండటం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ఇప్పటి వరకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సినిమాల ఓపెనింగ్స్ విషయంలో సూపర్ స్టార్ ఇమేజ్ ఒక్క పవన్ మహేష్ లకు మాత్రమే ఉంది. అయితే రేపు విడుదల కాబోతున్న ‘నోటా’ సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ లో ఏర్పడిన డిమాండ్ ను చూసిన వారు విజయ్ మహేష్ పవన్ కళ్యాణ్ ల స్థాయికి చేరిపోతాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 
జూన్ నుండి విజయ్ దేవరకొండ కొత్త సినిమా
అయితే ఇప్పటి వరకు చిన్న దర్శకులతో సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ పై టాలీవుడ్ పెద్ద దర్శకుల కన్ను పడుతోంది. విజయ్ స్టామినాకు టాప్ డైరెక్టర్స్ సహకారం కూడ లభిస్తే విజయ్ రేంజ్ స్థాయికి చేరుకుంటుందో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.  ప్రస్తుతానికి యూత్ విజయ్ నామస్మరణ చేస్తున్న నేపధ్యంలో అది కంటిన్యూ అయ్యేలా విజయ్ ఖంగారు నిర్ణయాలు లేకుండా ఎత్తుగడలు వేయగలిగితే అతడి స్థానం టాప్ హీరోల పక్కన చేరినట్లే. ఏది ఏమైనా రేపు విడుదల కాబోతున్న ‘నోటా’ ఓపెనింగ్ కలక్షన్స్ ను బట్టి విజయ్ రేంజ్ ని డిసైడ్ అవుతుంది అంటూ ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: