భారత దేశంలో పండుగలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు తెలుగు వారికి ఎంతో ఇష్టమైనవి.  దేశంలోనే కాదు ప్రపంచలో ఎక్కడ ఉన్నా ఈ పండుగలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.   కొత్త బట్టలు కుట్టించుకొని..ఇష్టమైన వంటకాలు వండుకొని..ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతారు.  ఇక తెలంగాణలో దసరా పండుగకు మరో విశిష్టత ఉంది.  దసరా ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణా ప్రాంతీయులు బతుకమ్మ ఆట ఆడతారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ నవమి వరకు బతుకమ్మ ఆటలతో తెలంగాణా ప్రాంతాలు సందడిగా ఉంటాయి. కొందరు నవరాత్రులలో నిత్యం బతుకమ్మ ఆటపాటలతో వేడుక చేస్తారు. అలా కుదరనివారు ఆశ్వయుజ అష్టమి నాడు అంటే దుర్గాష్టమి రోజున బతుకమ్మ ఆట ఆడతారు.   ఈరోజును బతుకమ్మ పండుగ లేదా సుద్దుల పండుగ అంటారు.  గత కొంత కాలంగా బతుకమ్మ ఉత్సవాల్లో ఎంతో మంది సెలబ్రెటీలు కూడా పాల్గొంటున్నారు.

 రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా..బతుకమ్మ పండుగ సమయంలో నిజామాబాద్ ఎంపీ కవిత తప్పకుండా బతుకమ్మ ఉత్సవంలో పాల్గొంటారు.  ఇక ఒకప్పటి సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి కూడా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటుంటారు.  అంతే కాదు ఈ పండుగలో మహిళలే కాదు..కొంత మంది సెలబ్రెటీ నాయకులు, నటులు కూడా పాల్గొంటూ ఎంతో ఉత్సాహాన్ని నింపుతారు.  ఈ మద్య బతుకమ్మ పండుగపై ఎన్నో యూట్యూబ్ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి.  ఇందులో కూడా పలువురు నటీనటులు పాల్గొంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: