ప్రపంచ వ్యాప్తంగా రాంబో అంటే తెలియని వారు ఉండారు..ఈ చిత్రంతో సిల్వెస్టర్‌ స్టాలోన్‌ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ హీరో అయ్యారు.  ఈ చిత్రంలోని రాంబోలాంటి పాత్రలు ఇతర భాషల్లో ఎన్నో వచ్చాయి.  1982లో తొలిసారిగా ఆయన ‘ఫస్ట్‌ బ్లడ్‌’ చిత్రంతో ‘రాంబో’ సీరిస్‌ చిత్రాలకు శ్రీకారం చుట్టారు. యాక్షన్‌ చిత్రాల చరిత్రలో ఈ సినిమాది ఓ ప్రత్యేక అధ్యాయం. 

ఈ చిత్రం ఆధారంగానే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ’రూపుదిద్దుకుంది.   మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం యాక్షన్ హీరోగా దుమ్మురేపాడు. ఆయన 150 చిత్రాల్లో ది బెస్ట్ చిత్రంగా ‘ఖైదీ’ అని చెబుతుంటారు. ఆ చిత్రంతో చిరంజీవి కెరీర్‌ సరికొత్త మలుపు తిరిగి, ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యారు. ‘ఖైదీ’ చిత్రానికి వచ్చిన వసూళ్లు ట్రేడ్‌ పండితుల్ని సైతం ఆశ్చర్యపరిచాయి.  హాలీవుడ్ లో ఫస్ట్ బ్లడ్ తర్వాత సిల్వెస్టర్‌ స్టాలోన్‌ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

వరుసగా ‘రాంబో’ సీరిస్‌ చిత్రాలు చేస్తూనే ఉన్నారు స్టాలోన్‌. . 72 ఏళ్ల వయసు ఉన్న ఈ నటుడు తాజాగా ‘రాంబో 5’ చిత్రానికి మంగళవారం రాత్రి శ్రీకారం చుట్టారు.   కౌబాయ్‌ డ్రస్‌లో ఉన్న వియత్నామ్‌ వీరుడు జాన్‌ రాంబో గెటప్‌ ఫస్ట్‌లుక్‌ను కూడా ఆయన పోస్ట్‌ చేశారు. ఆండ్రియన్‌ గ్రున్‌బెర్గ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: