ఈ నెల 11న విడుదల కాబోతున్న ‘అరవింద సమేత’ రిజల్ట్ గురించి జూనియర్ అభిమానుల కన్నా ఎక్కువ ఆతృతతో అల్లు అర్జున్ మహేష్ లు వేచి చూస్తూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘అరవింద’ విడుదల తరువాత ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా అల్లు అర్జున్ తో సినిమా చేయాలని భావిస్తున్న త్రివిక్రమ్ ఇప్పటికే బన్నీకి ఒక స్టొరీ లైన్ వినిపించనా బన్నీ వ్యూహాత్మకంగా ‘అరవింద సమేత’ బిజీ అయిపోయాక మళ్ళీ కూర్చుందాం అని చెప్పి ఈమూవీ రిజల్ట్ గురించి తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. 
Allu Arjun Upcoming Movies List 2018, 2019 & Release Dates
ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా ప్రిన్స్ మహేష్ బాబు కూడ తాను ప్రస్తుతం నటిస్తున్న ‘మహర్షి’ మూవీ తరువాత చేయవలసిన సుకుమార్ సినిమాను కొద్దిగా పక్కకు పెట్టి త్రివిక్రమ్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తూ మహేష్ కూడ ‘అరవింద సమేత’ రిజల్ట్ గురించి ఎదురు చూస్తున్నట్లు టాక్. దీనికితోడు సుకుమార్ సినిమాకు సంబంధించిన కథ విషయంలో మహేష్ కు ఏర్పడ్డ కొన్ని అనుమానాలు కూడ మహేష్ ను త్రివిక్రమ్ వైపు మళ్లేలా ఆలోచనలు కలిగిస్తోంది అని వార్తలు వస్తున్నాయి.

దీనితో ‘అరవింద సమేత’ రిజల్ట్ గురించి ఇండస్ట్రీ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుందో అర్ధం అవుతోంది. ఈ ఏడాది సమ్మర్ రేస్ కు వచ్చిన ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ సినిమాల తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి బ్లాక్ బస్తర్ హిట్ అని చెప్పుకోతగ్గ సినిమాలు ఏమి రాలేదు. ‘మహానటి’ ‘గీత గోవిందం’ లాంటి సినిమాలు సూపర్ హిట్ అయినా అది వందల కోట్ల కలక్షన్స్ తెచ్చుకున్న సినిమాలుగా మారలేదు. 
Is Trivikram Srinivas Quitting Films?  
దీనితో ప్రస్తుతం ఇండస్ట్రీ ఆసక్తి అంతా ‘అరవింద సమేత’ చుట్టూ తిరుగుతోంది. ఈమూవీ హిట్ కాకపోతే త్రివిక్రమ్ కోలుకోవడం చాల కష్టం. దీనికితోడు ఈమూవీ బయ్యర్లు కూడ భారీగా నష్టపోయి టాప్ హీరోల సినిమాలు పేరు చెపితే హడిలిపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఇలా ఉండగా బన్నీ సినిమా కుదరకపోతే త్రివిక్రమ్ దగ్గర వెంకటేష్ కోసం రాసిన స్క్రిప్ట్ రెడీగా ఉన్నా ఆమూవీ వెంకటేష్ నాగచైతన్యతో కలిసి నటిస్తున్న ‘వెంకీ మామా’ సినిమా తరువాతే అంటున్నాడట. దీనితో ‘అరవింద సమేత’ తరువాత త్రివిక్రమ్ చేయబోయే సినిమా ఏటాప్ హీరోతో ఉంటుంది అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని శేష ప్రశ్న అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: