దసరా పండుగ చివరి రోజునాడు అందరు ఆనందంగా జరుపుకునే ‘విజయదశమి’ రోజున దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను దహనం చేయడం వెనుక ఒకకారణం ఉంది. శ్రీరాముడు కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా జరుపుకునే వారు. శ్రీరాముడు విజయదశమి రోజునాడే రావణుడి పై దండెత్తి వెళ్లాడని పురాణాల కధనం.
ਦੇਸ਼ ਵਿਦੇਸ਼  ਵਿੱਚ ਮਨਾਇਆ ਜਾਵੇਗਾ ਅੱਜ ਦੁਸ਼ਹਿਰਾ
అందువల్ల ఆరోజున రావణాసురుని దిష్టిబొమ్మను తగులబెట్టే సాంప్రదాయం ఏర్పడింది. మహార్నవమినాడు శ్రీరామచంద్రుడు దుర్గాదేవిని ధ్యానించి రావణ సంహారానికి బయలుదేరగా దేవతలు పరమానందభరితులై శ్రీరాముడికి విజయం కలగాలని  దేవీ పూజ  చేశారు అని అంటారు.  రావణ దహనం వెనుక మరో పరమార్థం కూడ ఉంది.  రోజురోజుకీ స్త్రీల పై అత్యాచారాలు పెరగిపోతున్న పరిస్థితులలో పర స్త్రీని తల్లిలా సోదరిలా భావించాలని లేకుంటే   రావణుడిలా ఏదో ఒక రోజు పాపం పండి దహించుకుపోతారని చెపుతూ మనిషిలోని కామ  క్రోధ  మద మాత్సర్యాలు నశించాలని కోరుతూ ఈ రావణ దహన కార్య క్రమమం చేస్తారు అని కూడ చెపుతారు.

ఇది ఇలా ఉండగా మనదేశంలో సీతారాములను ఆరాధ్య దైవాలుగా భావించినట్లే మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రావణుడిని పూజించే సాంప్రదాయం కూడ ఉంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రావణుడికి ఒక మందిరం ఉంది. అక్కడి వాళ్లంతా దసరా రోజున  రావణాసురుడిని పూజిస్తారు. ఆ రోజున ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి ఆలయం తలుపులు మూసి వేస్తారు. మళ్లీ దసరాకి మాత్రమే ఈ ఆలయం తలుపులు తెరవడం విశేషం.
File:Ravana vahana.jpg
అదే విధంగా మధ్యప్రదేశ్ లోని 'విదిశా' ప్రాంతంలో రావణుడి పేరున ఒక గ్రామం వుంది. ఈ గ్రామంలో రావణుడికి ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో రావణుడు శయనిస్తున్నట్లుగా పడుకుని ఉంటాడు. ఆయన విగ్రహం 10 అడుగుల పొడవు ఉండటం ఆశ్చర్యం. ఇక్కడ రావణుడికి అనునిత్యం పూజలు చేస్తారు. ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తారు. అక్కడి వాళ్లంతా రావణుడిని 'రావణ బాబా' అని పిలుస్తూ తమ కష్టనష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా అక్కడి ప్రాంతం వారి కష్టాలను ఆ రావణ బాబా తెరుస్తాడు అనే నమ్మకం కూడ ఉంది. ఏది ఏమైనా  దసరా సంస్కృతిలో రావణ దహనం తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం..    



మరింత సమాచారం తెలుసుకోండి: