తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  కేవలం మూడు చిత్రాలతో తెలుగు రాష్ట్ర అభిమానులను మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటుకుంటూ వచ్చాడు.  పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డిలతో మంచి క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ..పరుశరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీతాగోవిందం’చిత్రంతో ఏకంగా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు.  ఈ చిత్రం వంద కోట్లు క్లబ్ లో చేరడంతో విజయ్ దేవరకొండ చిత్రాలపై అంచనాలు కూడా భారీగానే పరిగిపోయాయి. 

తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘నోటా’. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా  ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాడు. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఫస్ట్ టాక్ పై రక రకాల అభిప్రాయాలు వెల్లబుచ్చుతున్నారు. పూర్తిగా తమిళ నేపథ్యంలో తెరెకెక్కడం ఈ మూవీకి పెద్ద మైనస్‌గా చెబుతున్నారు.   రాజకీయ నాయకుడిగా విజయ్ నటను మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. 

ఫస్ట్ హాప్‌ వరకు ఓ మోస్తరుగా ఉన్న ‘నోటా’ మూవీ ...ఇంటర్వెల్ తర్వాత స్లో నేరేషన్‌లో సాగడం పెద్ద మైనస్.  ఈ చిత్రంలో మరోసారి తనదైన యాక్టింగ్‌తో విజయ్ దేవరకొండ చెలరేగిపోయాడని చెబుతున్నారు.నాజర్, సత్యరాజ్‌ల నటన బాగుంది. ఓవరాల్‌గా ‘నోటా’ మూవీ అనేది ప్రేక్షకులను మెప్పించని పొలిటిలక్ డ్రామాగా చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: