రాజమౌళి త్వరలో సెట్స్ పైకి తీసుకు వెళ్ళబోతున్న జూనియర్ చరణ్ ల మల్టీ స్టారర్ స్క్రిప్ట్ ఫైనల్ కావడంతో ఇప్పుడు ఆ స్క్రిప్ట్ కు సంబంధించిన డైలాగ్స్ వెర్షన్ రచన జరుగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా కథ 1980 కాలంనాటి బాలీవుడ్ మూవీల హిట్ ఫార్మలాను రిపీట్ చేయబోతోంది అని టాక్. 
SS Rajamouli RRR Movie Updates
ఈమూవీలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తే జూనియర్ దొంగగా కనిపించబోతున్నాడు. అయితే భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్న వీరిద్దరూ ప్రాణస్నేహితులు. ఇలా ఒక పోలీస్ ఒక దొంగ ప్రాణ స్నేహితులుగా ఉండే కథతో 1980 ప్రాంతంలో చాల బాలీవుడ్ సినిమాలు వచ్చాయి. ఆ ప్రభావంతో మన టాలీవుడ్ లో కూడ అనేక సినిమాలు వచ్చి ఒకనాటి హీరోలైన కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజులకు హిట్స్ ను ఇచ్చాయి. 

ఇప్పుడు అదే ట్రెండ్ ను మళ్ళీ కథలోకి తీసుకు వచ్చి రాజమౌళి 1940 కాలంనాటి స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ బ్రిటీష్ వారి ఆగడాలను ఫ్లాష్ బ్యాక్ గా మార్చి ‘ఆర్ఆర్ఆర్’ కథగా మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో చరణ్ నటించిన ‘జంజీర్’ జూనియర్ నటించిన ‘యమదొంగ’ సినిమాలను కలిపి తిరిగి రాజమౌళి చూపెడతాడా అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాలలో జోక్ చేస్తున్నారు. 

ఈమూవీ ప్రారంభానికి సంబంధించి నవంబర్ కార్తీక మాసంలో చాల బలమైన ముహూర్తం దొరకడంతో ముహూర్తాలను నమ్మని రాజమౌళి ఈమూవీ సక్సస్ కోసం తన నమ్మకాలను పక్కకు పెట్టి నవంబర్ లోనే ఈమూవీకి సంబంధించిన ఒక భారీ ఫైట్ సీన్ ను రాజమౌళి తనకు సెంటిమెంట్ గా బాగా కలిసి వచ్చిన హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో తీయడం ద్వారా ఈమూవీని మొదలు పెడతాడని టాక్. దీనితో ‘అరవింద సమేత’ విడుదల తరువాత నెలరోజులు సినిమాలకు సంబంధించి గ్యాప్ తీసుకోవాలి అని ఆలోచనలు చేసిన జూనియర్ తన ఆలోచనలు మార్చుకుని తన రెస్ట్ ను కేవలం 15 రోజులకు మాత్రమే తగ్గించుకుని రాజమౌళి కోసం త్యాగం చేస్తున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: