ఈరోజు ప్రముఖ తెలుగు దినపత్రికలు అన్నీ జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూలతో నిండిపోయాయి.  ఈవారం విడుదలకాబోతున్న ‘అరవింద సమేత’ సినిమాను ప్రమోట్ చేస్తూ జూనియర్ ఇచ్చిన ఈఇంటర్వ్యూలలో ఆసినిమా విషయాల కంటే తన జీవితానికి సంబంధించిన లక్ష్యాల గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యంగా మరణం గురించి జూనియర్ చేసిన ప్రతి కామెంట్ లోను వేదాంతం కనిపించింది. 
నా ఎనర్జీని దృష్టిలో పెట్టుకొవద్దు
ప్రతిరోజు ఒక వ్యక్తి నిద్ర లేచినప్పుడు ఆరోజు తనకు అదనంగా జీవించడానికి దేవుడు ఇచ్చిన బోనస్ గా భావించాలి అని అంటూ ఇంకా ఎంత కాలం బతకాలి అని కోరుకోకుండా సంతోషంగా ‘ఇంత కాలం హ్యాపీగా బ్రతికాను నన్ను ఇక తీసుకువెళ్ళిపో’ అని ధైర్యంగా దేవుడు దగ్గర నిలబడి చెప్పుకోగలిగిన వ్యక్తి మాత్రమే సంపూర్ణమైన జీవితాన్ని చూసినట్లు అంటూ జూనియర్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ప్రతిమనిషికి ప్రతి క్షణం లక్ష్యాలు మారిపోతు ఉండాలి అంటూ తన లక్ష్యాలను వివరించాడు జూనియర్.
పెనిమిటి పాట షూట్ గురించి
తాను చిన్నప్పుడు స్కూల్ కు వెళ్ళినప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళిపోతే బాగుండును అని తనకు అనిపించిందని చెపుతూ తాను 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆ పరీక్ష పాస్ అయితే చాలు అనుకున్నానని అంటూ తన సినిమా కెరియర్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తన తల్లికోసం ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్న తాను 25 సినిమాలు చేస్తానని అనుకోలేదు అంటూ క్షణక్షణం మారిపోతున్న లక్ష్యాలు తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అంటూ తన కెరియర్ పై తానే ఆశ్చర్యపోతున్నాడు జూనియర్.
మంచి భర్తగా, తండ్రిగా, కొడుకుగా
ఇదే సందర్భంలో ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధి హరికృష్ణ మరణం తరువాత కారు డ్రైవింగ్ సీటు దగ్గర కూర్చుంటే భయం వేస్తోందా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తన తండ్రి మరణం తనను చాల ప్రాక్టికల్ మనిషిగా మార్చివేసిందని ఎవరి జీవితం కోసం మరొకరి జీవితం ఆగదు అన్న జీవిత సత్యం తెలుసుకోవడమే కాకుండా ఎవరి జీవితం వెనుక వారు పరుగులు పెట్టాలిసిందే అన్న వాస్తవాలు తెలిసి ఒక విధంగా జీవితమంటే తనకు ప్రస్తుతం పెద్దగా ఆసక్తి కనపడటం లేదు అంటూ తనలోని జీవిత సత్యాలను బయటపెడుతున్నాడు జూనియర్ ...





మరింత సమాచారం తెలుసుకోండి: