దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు జాతకాలు అన్నా ముహూర్తాలు అన్నా విపరీతమైన నమ్మకం. దీనికితోడు అతడి చేతివేళ్ళకు రకరకాల స్టోన్స్ తో కూడిన ఉంగరాలు కనపడుతూ ఉంటాయి. దీనితో తన కెరియర్ కు సంబంధించి అత్యంత కీలక సినిమాగా మారిన ‘అరవింద సమేత’ విషయంలో అనేక సెంటిమెంట్లు పాటిస్తూ ఎట్టి పరిస్తుతులలోను ఈమూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని తన సర్వశక్తులు ధారపోస్తున్నాడు.
 à°°à°¿à°²à±€à°œà±â€Œà°•à± ముందు టెన్షన్‌‌గానే
ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా విడుదల చేసిన జూనియర్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలలో జూనియర్ తన భుజానికి ఒక పెద్ద బ్యాగ్ వేసుకుని నుంచుని ఉన్న ఫోటోలు విడుదల చేసారు. ఈ ఫోటోలకు కొన్ని సెంటిమెంట్స్ లీక్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ చాలమందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.
నాకు వరుస ఫ్లాపులున్నాయి కదా
త్రివిక్రం గతంలో తీసిన సినిమాలకు సంబంధించి కొన్ని సన్నివేశాలలో హీరో ఇలా పెద్దపెద్ద బ్యాగ్లు భుజానికి ఎత్తుకున్న సందర్బాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘అ ఆ’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘ఖలేజా’ సినిమాలలో హీరోలు ఇలా పెద్దపెద్ద బ్యాగ్ లు పట్టుకుని నడిచిన సీన్స్ ఉన్నాయి. అయితే ఈ సెంటిమెంట్ వల్ల ‘అ ఆ’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ హిట్ అయితే ‘ఖలేజా’ ఘోరమైన ఫ్లాప్ గా మారింది.
బలమైన కథ, పాయింట్‌తో
దీనితో ‘అరవింద సమేత’ మూవీలో త్రివిక్రమ్ అనుసరించిన ఈ బ్యాగ్ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 92 కోట్ల బిజినెస్ జరిగిన ఈమూవీ సక్సస్ అనిపించుకోవాలి అంటే నికర 137 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టలి. అంటే దసరా ప్రారంభం అయిన రెండవరోజు విడుదల కాబోతున్న ఈమూవీకి దసరా పండుగ అయ్యేవరకు కనీసం 10 రోజులు ఎక్కడా కలెక్షన్స్ లో డ్రాప్ లేకుండా దుమ్ము రేపాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: