‘అరవింద సమేత’ అమెరికాలోనే కాకుండా ఇంగ్లాండ్ లో కూడ అనేక ప్రదేశాలలో విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈమూవీ సెన్సార్ ను ఇంగ్లాండుకు చెందిన బ్రిటీష్ బోర్డ్ ఆఫ్  ఫిలిం సర్టిఫికేషన్ వారు చూసి ఈమూవీలోని తీవ్ర వయలన్స్ స్కీన్స్ కు తీవ్ర అభ్యంతరాలు చెప్పి వారి సెన్సార్ నియమ నివంధనలను అనుసరించి 15 రేటింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటీష్ సెన్సార్ బోర్డ్ నిబంధనల ప్రకారం 15 రేటింగ్ అంటే ఎట్టి పరిస్థుతులలోను ఈమూవీని 15 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నవారు ఖచ్చితంగా ఈసినిమాను చూడకూడదు అన్న నిబంధన బ్రిటీష్ ఫిలిం సెన్సార్ బోర్ద్ చాల ఖచ్చితంగా పాటిస్తుంది. 
ఐటంలా చేద్దామనే ఉద్దేశ్యం లేదు
ఈసినిమాలో భయకరమైన వయలెన్స్ తో పాటు ఈమూవీ రన్ టైమ్ 162 నిముషాలు ఉన్నట్లు సమాచారం. ఈమూవీ మూల కథ విషయంలోకి వస్తే తండ్రి హత్య గురించి పగ తీర్చుకునే కొడుకుకు సంబంధించిన రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ స్టోరీ అని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈసినిమాకు సంబంధించిన మన తెలుగు సెన్సార్ బోర్డ్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి అని వార్తలు వస్తున్నాయి.
బలవంతంగా బాడీ చూపిస్తున్నట్లు ఉండకూడదు
ఈసినిమాను చూసిన మన సెన్సార్ బోర్డ్ అధికారులు U/A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అయితే మన తెలుగు సెన్సార్ బోర్డ్ అధికారులు మాత్రం ఈమూవీలోని మితిమీరిన హింస గురించి పెద్దగా పట్టించుకోకుండా ఎటువంటి కట్స్ విధించకుండా ఈమూవీకి లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం. కేవలం ఒక రెండు డైలాగ్స్ గురించి కొద్దిగా చర్చలు జరిగినా త్రివిక్రమ్ ఇచ్చిన సమాధానంతో ఆరెండు డైలాగ్స్ ను కూడ క్లియర్ చేసినట్లు టాక్.
అలా అయితే మాకూ ఇబ్బందే
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసినిమాకు సంబంధించి ఉదయం 5 గంటల నుండి షోలు వేసుకుంటూ రోజు మొత్తంగా 6 షోలు వేసుకోవడానికి లైన్ క్లియర్ చేసిన పరిస్థుతులలో ఈమూవీ బయ్యర్లు మంచి జోష్ లో ఉన్నారు. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత లక్షలాది ప్రజల కుటుంబాలలో జరిగిన విషాద సంఘటనల నేపధ్యంలో వచ్చిన ఒక నవల ఆధారంగా త్రివిక్రమ్ మహాభారతంలో యుద్ధ పరిస్థుతులకు బదులు రాయలసీమ ఫ్యాక్షన్ తీసుకు వచ్చి ఆ ఫ్యాక్షన్ వల్ల నష్ట పోయిన కొందరి జీవితాల పరిస్తుతులను యధాతధంగా చూపించిన ప్రయత్నమే ‘అరవింద సమేత’ అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: