గుబురు గెడ్డంతో మౌన మునిలా కనిపించే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి తన పద్ధతి మార్చి ‘అరవింద సమేత’ ను ప్రమోట్ చేస్తూ అనేక పత్రికలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేస్తున్నాడు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ ‘జనసేన’ గురించి అదేవిధంగా అతడితో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
మంచి సినిమాల చూసి
చాలామంది పవన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక తన సలహాలు ఉంటాయని భావిస్తూ ఉంటారని వాస్తవానికి పవన్ రాత్రికి రాత్రి తీసుకునే నిర్ణయాలు అతడి సోదరుడు చిరంజీవికి కాని అదేవిధంగా అతడి తల్లికి కానీ చెప్పకుండా తనకు తానే స్వతంత్రంగా తీసుకుంటాడు అని కామెంట్స్ చేసాడు త్రివిక్రమ్. అంతేకాదు పవన్ రాజకీయ ఉపన్యాసాల వెనుక తన హస్తం ఉంది అన్న వార్తల పై స్పందిస్తూ తాను వ్రాసే డైలాగ్స్ ఒకొక్కసారి తనకే నచ్చక తెల్లవారి కాగితాలను చింపేసే మనస్తత్వం ఉన్న తాను ఎవరిమాటలను లెక్కచేయని పవన్ కు రాజకీయ ఉపన్యాసాలు ఎలా వ్రాయగలను అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేసాడు. 
ప్రశంసలకు లొంగిపోను.. పట్టించుకోను
ఇదే సందర్భంలో త్రివిక్రమ్ మరొక ట్విస్ట్ ఇస్తూ తాను పవన్ కళ్యాణ్ తో ఎన్నికల తరువాత తీయబోయే సినిమాలో పాటలు ఉండవని తాను ఇప్పటికే పవన్ కోసం వ్రాసుకున్న ‘కోబలి’ కథకు మార్పులు చేసి ఎన్నికల తరువాత పరిస్థుతులకు అనుగుణంగా తాను పవన్ తో తీయబోయే సినిమా ఉంటుంది అని లీకులు ఇస్తున్నాడు ఈమాటల మాంత్రికుడు. ఇక తనను ఫిలిం ఫంక్షన్స్ లో వేదిక పైకి పిలుస్తూ తనను మాటల మాంత్రికుడు అన్న బిరుదుతో తనను పిలవడం తనకు ఇష్టం లేదు అని అంటూ ఆ మాట వింటున్నప్పుడు తనకు తల పై ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్లు అనిపిస్తుంది అంటూ తనకు మీడియా ఇచ్చిన ట్యాగ్ పై తానే సెటైర్లు వేసుజున్నాడు. 
బాధపడుతాను.. కానీ
‘అరవింద సమేత’ మూవీ పై పెట్టిన భారీ బడ్జెట్ గురించి మాట్లాడుతూ తాను ఎంత ఖర్చు చేసినా తాను తీసిన సినిమాలు మార్కెట్ అవుతున్నాయి కాబట్టి తనకు పిలిచి అవకాశాలు ఇస్తున్నారని అంటూ తన గొప్ప తనాన్ని పరోక్షంగా వివరించాడు. తాను ప్రతి విషయంలోనూ చాల నిజయితీగా ఉంటాను అన్న విషయాన్ని వివరిస్తూ తన నిజాయితీ నచ్చడం వల్లే టాప్ హీరోలు అంతా తనతో సాన్నిహిత్యంగా ఉంటారు అని చెపుతూ తాను అందరివాడిని అన్న సంకేతాలు ఇస్తున్నాడు త్రివిక్రమ్..
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: