ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తూ గాయత్రి రూపంలో కనిపించే అమ్మవారిని ఈరోజు చాల చోట్ల లలితా దేవిగా ఆరాధిస్తారు. గాయత్రి మంత్రం రెండు రకాలు ‘లఘు గాయత్రి’ మంత్రం ‘బ్రుహద్గాయత్రి’ మంత్రం. ప్రతిరోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది అని అంటున్నారు. 

సకల మంత్రాలకు మూల శక్తిగా వేద మాతగా ప్రసిద్ధి పొంది ధవళ వర్ణంతో ప్రకాశించే అమ్మవారిని వర్ణించడానికి మాటలు చాలవు. శిరస్సు యందు బ్రహ్మ హృదయం అందు విష్ణువు శిఖం పై రుద్ర్రుడు కనిపిస్తూ ఉండగా ఈరోజు అమ్మవారు గాయత్రి రూపంలో ఉన్న లలితగా దర్శినమిస్తుంది.

సమస్త దేవతా మంత్రాలు గాయత్రిమంత్రంలో అను సంధానం అవుతాయి. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాత మాత్రమే మన దేవుళ్ళకు అన్న ప్రసాదాలు నివేదన చేస్తారు. గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత సూర్య భగవానుడు. ఈరోజు గాయత్రి అమ్మవారిని దర్శించడం వల్ల సౌర్య శక్తీ లభించి ఆరోగ్యం సంప్రాతిస్తుందని మన ఋషులు చెపుతున్నారు.

ఈరోజు విజయవాడలో తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఖడ్గమాలా అర్చనను అత్యంత నిష్టగా చేసి ఈరోజు జరిపించే లక్ష కుంకుమార్చన అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ఈరోజు అమ్మవారిని చూస్తే చాల కొలిచే వాడికి కొంగుబంగారం అన్న భావనతో భక్తులు అమ్మను ఆరాధిస్తారు. ఈరోజు ప్రసాదంగా కేసరి నివేదన చేస్తారు. భక్తితో కొలిచి అమ్మ కరుణను పొందుదాం..


మరింత సమాచారం తెలుసుకోండి: