అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘సాహో’ నిర్మాణం లో ఉండగానే ప్రభాస్ జిల్  రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఒక అయోమయం ప్రస్తుతం ప్రభాస్ ను వెంటాడు తున్నట్లు టాక్. టాప్ హీరోల సినిమాలకు సంబంధించి టైటిల్స్ విషయంలో అయోమయం ఏర్పడటం సర్వసాధరణమైనా ప్రభాస్ కొత్త  సినిమాకు టైటిల్ గా ఒక హిందీ టైటిల్ తో పాటు మరో ఫ్రెంచ్ టైటిల్ పోటీ పడుతూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. 
Prabhas
మొదట్లో ఈసినిమాకు ‘జాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావించి నట్లు  టాక్. ‘జాన్’ అనే పదం తెలుగు పదం కాకపోయినా హిందీలో అందరికీ బాగా తెలిసిన ఈపదంను టైటిల్ గా ఫిక్స్ చేస్తే అందరికీ చాలా సులువుగా కనెక్ట్ అవ్వవచ్చని దర్శకుడు రాధ కృష్ణ  భావించి నట్లుటాక్. అయితే అనూహ్యం ఈమూవీకి సంబంధించి ఒక  ఫ్రెంచ్ టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.     
Prabhas
తెలుస్తున్న సమాచారం మేరకు ఆ టైటిల్ పేరు ‘అమూర్’  ఫ్రెంచ్ భాషలో ‘అమూర్’ అంటే ప్రేమ అని అర్థం అని తెలుస్తోంది. కథ ప్రకారం ఈసినిమా యూరప్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమ కదా కాబట్టి ఈ టైటిల్ అన్ని విధాలా బాగుటుందని లేటెస్ట్ ఆలోచన అని అంటున్నారు. ప్రస్తుతం  ప్రభాస్ పూజా హెగ్డే ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్న ఈమూవీని అనుకోకుడా ‘సాహో’ విడుదల ఆలస్యం అయితే ప్రభాస్ అభిమానులు నిరుత్సాహ పడకుండా ముందుగా రిలీజ్ చేయాలని ప్లాన్ అని అంటున్నారు. 
Prabhas
పీరియాడికల్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ పాత్ర  రకరకాల షేడ్స్ లో కనిపిస్తుందని సమాచారం. జాతీయ అవార్డు గ్రహీత అమిత్ త్రివేది ఈ ప్రేమకథా చిత్రానికి సంగీతం అందిస్తున్న నేపధ్యంలో ఈమూవీలోని పాటలు చాలా మెలోడి తో ఉంటాయని తెలుస్తోంది. ఇంతకీ ప్రభాస్ ఈ రెండు టైటిల్స్ లో దేనిని ఎంచుకుంటాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..   



మరింత సమాచారం తెలుసుకోండి: