తెలుగు ఇండస్ట్రీలో రారాజుగా వెలిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.  ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు.  అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు.  పది సంవత్సాల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు.   ఈ చిత్రం సోషల్ మేసేజ్ తో పాటు మంచి ఎంట్రటైన్ మెంట్ ఉండటంతో సూపర్ హిట్ అయ్యింది. 

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంలో నటిస్తున్నాడు.  అయితే ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకులు కొరటాల శివ ఓ చిత్రం తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.  ఇందుకోసం కొరటా మంచి కథ కోసం బిజీ బిజీ గా ఉన్నట్లు తెలుస్తుంది.  ఈ నేపథ్యంలో ఈ సినిమా కథా వస్తువు ఏమైవుంటుందనే ఆసక్తి అందరిలోను నెలకొంది.  కాగా, ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉండబోతుందట..అంతే కాదు చిరంజీవి రైతు బాంధవుడిగా కనిపిస్తారట.

రైతుల తరఫున నిలవబడి .. వాళ్ల సమస్యలపై పోరాడే శక్తిగా ఈ సినిమాలో చిరంజీవి కనిపించనున్నారని సమాచారం.  ఇప్పటి వరకు కొరటాల తీసిన చిత్రాలు అన్నీ మంచి సందేశాత్మకంగా ఉన్నవే..మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఈ మద్య రిలీజ్ అయిన ‘భరత్ అనే నేను’. అలాగే ఈ సినిమాలోనూ ఒక సందేశం ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకి 'రైతు' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట. సంక్రాంతికి ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: