ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు ఇతర సంస్థల్లో కూడా ‘మీ టూ ’ ఉద్యమం తారా స్థాయికి చేరుకుంది.  తమను నమ్మించి మోసం చేయాలని..చేసిన వారి గుట్టు రట్టు చేస్తున్నారు కొంత మంది మహిళలు..సెలబ్రెటీలు.  హాలీవుడ్ లో మొదలైన ‘మీ టూ ’ ఉద్యమం ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు ఇతర ఇండస్ట్రీలో కూడా ప్రకంపణలు సృష్టిస్తుంది.  తాజాగా తనుశ్రీ దత్తా, కంగనా కౌర్ లు తమపై కొంత మంది సినీ ప్రముఖులు లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు చేశారు.  అయితే వారికి ఇండస్ట్రీ కొంత మంది మద్దతు ఇవ్వగా..మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. 

ప్రస్తుతం ‘మీ టూ ’ ఉద్యమం ఉధృతంగా ఒకవైపు సాగుతుండగానే తారలకు చేదు అనుభవాలు మాత్రం ఆగటం లేదు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ మోడల్, నటి అమన్ సాంధుతో ఫోన్లో తనతో కాంప్రమైజ్ అయితే సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పినట్లు నటి ఆరోపించింది. అంతే కాదు ఆ ప్రబుద్దుడిని రోడ్డు పైకి పిలిచి చొక్కా పట్టుకుని నిలదీసింది. నాతో ఫోన్లో ఏం చెప్పావు? నాకు సినిమా ఛాన్స్ ఇస్తానన్నావు.

ఆ విషయం విని నేను ఎంతో సంతోషించాను..కానీ తర్వాత ఏం మాట్లాడావు..ఆ ఆఫర్ ఇస్తే నీకు నేను ఆఫర్ ఇవ్వాలా? నీతోనూ నీ నిర్మాతతోనూ నేను కాంప్రమైజ్ కావాలా? నీకు అక్కాచెల్లెళ్లు లేరా? నీకు భార్యాపిల్లలు లేరా? ఏం మాట్లాడుతున్నావ్..ఆడది అంటే అంత చులకనా..అందరూ అలాగే ఉంటారనుకుంటున్నావా? అంటూ చెంప ఛెల్లుమనిపించింది.   అంతేకాకుండా... ఇలాంటివారు సినిమా ఛాన్సులిస్తామని అమ్మాయిలను మోసం చేస్తున్నారు. జాగ్రత్త అంటూ పిలుపునిచ్చింది. ఆమె చెంపలపై వాయించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: