‘అరవింద సమేత’ మ్యానియా పీక్స్ కు చేరడంతో వచ్చేవారం రాబోతున్న దసరా పండుగవరకు ఈ మూవీ ప్రభంజనం కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఈ సూపర్ సక్సస్ ఆనందాన్ని మీడియా వారితో పంచుకుంటూ నిన్న సాయిత్రం ఈ మూవీ నిర్మాతలు ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో దిల్ రాజ్ అరవింద సమేత మ్యానియా పైచేసిన కొన్ని కామెంట్స్ ఆ మీడియా మీట్ కు వచ్చిన వారిని ఆశ్చర్య పరిచినట్లు వార్తలు వస్తున్నాయి. 
Elated with the success of the latest romantic drama, the producer thanked the audience and the six directors who he worked with this year. (Photo: DC)
‘అరవింద సమేత’ నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఈమీడియా మీట్ లో త్రివిక్రమ్ తో కలిసి మీడియా వర్గాలతో మాట్లడుతున్నప్పుడు దిల్ రాజ్ కు ఒక ఊహించని పశ్న మీడియా నుండి ఎదురైంది. ‘అరవింద సమేత’ బ్లాకు బస్టర్ హిట్ అయిన నేపధ్యంలో దసరా రోజున విడుదల చేయాలి అని భావిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమే’ విడుదల చేస్తారా లేకుంటే ఒక వారం గ్యాప్ ఇస్తారా అన్న ప్రశ్నకు దిల్ రాజ్ షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు. 

దసరా లాంటి పెద్ద పండుగ సందర్భంగా ప్రేక్షకులు ఖచ్చితంగా రెండు సినిమాలను ఆదరిస్తారని నమ్మకం తనకు ఉంది అంటూ ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ అయితే తన ‘హలో గురు ప్రేమకోసమే’ హిట్ అవుతుంది అంటూ కామెంట్స్ చేసాడు. అయితే సాధారణంగా ఒక మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత వెంటనే మరుసటి వారంలోనే విడుదలైన సినిమా ఎంత బాగున్నా ఆసినిమా గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకున్న సందర్భాలు చాల అరుదు. 
Hello Guru Prema Kosame Movie release date: October 18th, 2018.
అయితే దిల్ రాజ్ నమ్మకం నిజం అయితే డిస్ట్రిబ్యూటర్ గా ‘అరవింద సమేత’ వల్ల నిర్మాతగా ‘హలో గురు ప్రేమకోసమే’ ద్వారా ఇప్పటికే ‘శ్రీనివాస కళ్యాణం’ ‘లవర్’ సినిమాల ద్వారా నష్టపోయిన దిల్ రాజ్ కష్టాలు తీరే ఆస్కారం ఉంది. అందుకోసమే తను రామ్ తో తీసిన సినిమాకు ఎటువంటి పోటీ లేకుండా కేవలం ‘పందెం కోడి 2’ డబ్బింగ్ సినిమాతో పోటీగా వస్తున్నాడు. ఇంతకీ దిల్ రాజ్ నమ్మకాలు ఎంతవరకు విజయవంతం అవుతాయో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: