భారత స్వాతంత్ర సంగ్రామం పునాదిగా సినిమాను తెరకు ఎక్కించాలంటే కథలు బోలెడు. అనేకమంది స్వాతంత్రం కోసం అసువులు బాశారు. ఏ చిన్న కథను తీసుకున్నా ఒక ప్రభందంగా కథ రాయవచ్చు. దమ్మున్న సంబాషణల రచయిత దొరికితే పంచ్ డైలాగ్స్ తో స్క్రీంపై దుమ్మురేపొచ్చు. అలాంటి ఒక చిన్న కథను అద్భుతంగా ఎలవేట్ చేసి ఒక దృశ్యకావ్యంగా సృష్టిస్తున్న చిత్రమే సైరా!  
Image result for sye raa amitabh look
ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనికులకు, ఉయ్యలవాడ నరసింహారెడ్డి అనుచరులకు జరిగిన యుద్ధాన్ని ప్రత్యేకంగా జార్జియా లో చిత్రీకరిస్తున్నారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రస్తావనతోనే 18వ శతాబ్దంలోని కథలోకి వెండితెర గ్రాఫిక్స్ తో అద్భుత సాంకేతిక విలువలతో దూసుకుపోవటం జరుగుతుంది. తలచుకున్నా ఒక ఊహా చిత్రం ప్రతి మదిలో కనిపిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’ టైటిల్‌ రోల్‌లో మెగా స్టార్ చిరంజీవి పాలలో నీళ్ళలా ఒదిగిపోయినట్లు నటిస్తున్న దాఖలాలు కనిపిస్తూనే ఉన్నా ఈ సినిమాకు సురేందరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
 Image result for sye raa amitabh look
రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్, విజయ్‌ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా మొదలైన దేశవ్యాప్త నటీనట వర్గం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే.
Image result for sai raa staars
సైరా బృందానికి, ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనికులకు మధ్య యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సుదీప్, విజయ్‌ సేతుపతిలు కూడా పాల్గొన్నారు. ఈ షూట్‌లో దాదాపు రెండువేల మూడువందల మంది పాల్గొంటున్నారని టాక్‌. స్పైడర్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే, నిన్న (గురువారం) అమితాబ్‌
Image result for sye raa amitabh official look
బచ్చన్‌ పుట్టినరోజు, 76వ వసంతంలోకి అడుగుపెట్టు తున్న సందర్భంగా ‘సైరా’ చిత్రంలోని అమితాబ్‌ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు.  ఈ సినిమాలో ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గురుదేవుడు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌ బచ్చన్ కనిపిస్తారట. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: