రామ్ గోపాల్ వర్మ అర్దరాత్రి తీసుకునే నిర్ణయాలు సంచాలనంగానే ఉంటాయి. గత కొద్దిరోజులుగా సంచలనాలకు దూరంగా ఉన్న వర్మ తిరిగి వార్తలలోకి వచ్చాడు. తాను గతంలో ప్రకటించి వదిలేసిన ‘లక్షీస్ ఎన్టీఆర్’ ను వచ్చే వారం రాబోతున్న విజయ్ దశమి పండుగ రోజున ప్రారంభించబోతున్నట్లు స్వయంగా వర్మ ట్విట్ చేసి మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు. 
Ram Gopal Varma images. Lakshmi's NTR images
అంతేకాదు ఈసినిమాలో నటించబోయే నటీనటుల వివరాలను కూడ దసరా నాడు ప్రకటిస్తానని వర్మ అధికారికంగా తెలియచేసాడు. బాలకృష్ణ తీసుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఎక్కడ ఆగిపోతుందో అక్కడ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ మొదలవుతుంది అని చెప్పడమే కాకుండా ఎన్టీఆర్ బయోపిక్ రెండవ పార్ట్ ‘మహానాయకుడు’ విడుదల కాబోతున్న జనవరి చివరి వారంలోనే తన మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వస్తుందని మరో ట్విస్ట్ ఇచ్చాడు.
Ram Gopal Varma
అత్యంత వేగంగా సినిమాలు తీయడంలో వర్మ సిద్ధహస్తుడు కావడంతో ఈమూవీ వర్మ తలుచుకుంటే అనుకున్న సమయానికి విడుదల చేయడం పెద్ద కష్టం కాదు. అయితే సుమారు 80 కోట్ల బిజినెస్ టార్గెట్ తో విడుదలకు రెడీ అవుతున్న ఎన్టీఆర్ బయోపిక్ మార్కెట్ పై వర్మ ప్రకటన తీవ్ర ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. 
Lakshmi's NTR Biopic Story Details
ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లో ఎటువంటి సంచలనాలు లేకుండా కేవలం ఎన్టీఆర్ నటించిన సినిమాలలోని హిట్ సాంగ్స్ రీమిక్స్ గా మారుతున్న నేపధ్యంలో మధ్యలో ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రకటన ఎన్టీఆర్ బయోపిక్ పై పెరిగిన అంచనాలను పూర్తిగా తగ్గించి వేస్తుంది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వర్మ చేయబోయే ఈ ప్రమోగం బాలకృష్ణకు మాత్రమే కాకుండా తెలుగుదేశం అధినాయకత్వానికి కూడ ఏమాత్రం నచ్చాడు. ఇలాంటి పరిస్థుతులలో వర్మ ప్రయత్నాలకు ఎలా అడ్డుకట్ట వేస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ బాగా పెరిగి పోతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: