ఇప్పుడు ప్రపంచం మొత్తం ‘మీ టూ ’ ఉద్యమం తీవ్ర సంచలనం రేపుతుంది.  హాలీవుడ్ లో మొదలైన ఈ మీ టూ ఉద్యమం భారత దేశంలో కూడా ప్రకంపణలు సృష్టిస్తుంది.  అయితే గతంలో తమపై జరిగిన అన్యాయాలను కొంత మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పడంతో ఆ ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటుంది.  ఈ మద్య తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లో ఇండస్ట్రీలో తమ పట్ల కొంత మంది దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు.  అంతే కాదు కొంత మంది ఇండస్ట్రీకి చెందిన వారు తమపై లైంగిక దాడులు కూడా చేశారని ఆరోపిస్తున్నారు.  ఇక టాలీవుడ్, కోలీవుడ్ లో సింగర్ చిన్మయి ‘మీ టూ’ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. 

గాయని చిన్మయి,  రచయిత వైరాముత్తుల వివాదం తమిళ సినీరంగంలో సంచలనంగా మారింది. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమం తర్వాత వైరాముత్తు తనను గదికి వచ్చి కోపరేట్ చేయాలని కోరాడంటూ చిన్మయి ఇటీవల ట్వీట్టర్ వేదికగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  దాంతో ఈ వివాదంపై రక రకాల కామెంట్స్ వినిపిస్తుంది.  తాజాగా ఈ వివాదంపై విశ్వనటుడు కమల్ హాసన్ స్పందిస్తూ..చిన్మయి, వైరాముత్తుల పేర్లు ప్రస్తావించకుండా మీటూ ఉద్యమంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై బాధితురాలు బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు సైతం దీనిపై మాట్లాడుతున్నారు. వారి అభిప్రాయాల వల్లే ఇది వివాదానికి దారితీస్తుంది.  అయితే ‘మీ టూ’ ఉద్యమం స్వచ్ఛందంగా సాగితే..నిజాయితీగా ఉంటే తాను పూర్తి సహకారం అందిస్తానని అన్నారు.  అంతే కానీ..ఈ ఉద్యమం పేరు చెప్పుకొని కొంత మంది పై కావాలని బురుదజల్లే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఇండస్ట్రీ వివాదాల్లో కూరుకు పోతుందని అన్నారు.   ఈ ఉద్యమం స్వచ్ఛంగా ఉండాలి. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలకు కూడా అవగాహన కలగాలి  అని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: