బాలీవుడ్‌లో  మీటూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తమపై అసభ్యంగా ప్రవర్తించిన దర్శకులు, నిర్మాతలు, నటుల పేర్లను పలువురు బయటపెడు తున్నారు.  పనిచేసే ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని, అది మనసుని కలచి వేస్తోందని ఆయన ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిపై ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌ స్టయిలిస్ట్‌ సప్నా భవ్నానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘మీటూ’ ఉద్యమం గురించి ఇటీవల ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు.  ఏ మహిళ కూడా ఎక్కడా లైంగిక వేధింపులు ఎదుర్కోకూడదు. ముఖ్యంగా ఆమె పనిచేసే వాతావరణంలో అలాంటివి ఎదురైనప్పుడు సదరు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.


మన సమాజంలో మహిళలు, పిల్లలకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి. మన దేశంలో పని చేసే ప్రదేశాల్లోనే మహిళలు ఎక్కువగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇది మనసును కలచివేస్తోంది. వారికి దక్కాల్సిన గౌరవం, రక్షణ ఇవ్వకపోతే మన దేశంపై చెరిపేసుకోలేని మచ్చ పడుతుంది అన్నారు. ఇదిలా ఉంటే.   మీటూ ఉద్యమంలో తాజాగా బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేరు కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవ్నాని స్పందిస్తూ.. ఇది చాలా పెద్ద అబద్ధం.. మీరు నటించిన పింక్ వచ్చి, వెళ్లింది. అలాగే త్వరలోనే మీకున్న సామాజిక వేత్త అనే పేరు కూడా పోతుంది.


మీకు సంబంధించిన నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. నా ట్వీట్ చదివిన వెంటనే మీరు గోళ్లు కొరుక్కుంటారని అనుకుంటున్నా. కానీ మీరు కొరుక్కోవడానికి మీ గోళ్లు సరిపోవు  అంటూ ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. అమితాబ్‌ గురించి సప్నా ఏ నిజం బయటపెడుతుంది? అసలేం జరిగి ఉంటుందంటూ నెటిజన్లు సప్నాకు మెసేజ్‌లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: