పవన్ తనకు ఆత్మీయుడు అయినప్పటికీ పవన్ రాజకీయ ఎత్తుగడల వెనుక తన హస్తం లేదు అంటూ దర్శకుడు త్రివిక్రమ్ ఈమధ్య ‘అరవింద సమేత’ మూవీని ప్రమోట్ చేస్తూ మీడియా ఎదుట చెప్పాడు. అయితే ఇలా చెప్పి కొన్నిరోజులు గడవకుండానే త్రివిక్రమ్ తన మాట తప్పి ‘జనసేన’ తలపెట్టిన కవాత్ వెనుక అజ్ఞాతవాసిగా మారడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

రేపు ధవళేస్వరం బ్యారేజ్ బ్రిడ్జ్ పై పవన్ తలపెట్టిన కవాత్ కు సంబంధించిన పాట ట్యూన్ ను సంగీత దర్శకుడు తమన్ రూపొందిస్తే సినీగేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ ప్రచార గీతాన్ని రచించాడు. పవన్ ‘జనసేన’ కు మరింత క్రేజ్ ఏర్పడేలా ఈ ప్రచారగీతాన్ని జనం మధ్య బాగా తీసుకువెళ్ళడానికి ఈ సాంగ్ ట్యూనింగ్ విషయంలో అదేవిధంగా ఈ సాంగ్ రచన విషయంలో ప్రతి అంశంలోనూ త్రివిక్రమ్ సలహాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 
pk
ఈపాటకు సంబంధించిన కొంత భాగాన్ని పవన్ తన ట్విటర్ లో రిలీజ్ చేయడంతో ఇప్పుడు ఈ పూర్తి పాట విడుదల కోసం పవన్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎన్ని సందేశాలు పంపినా చిరంజీవి ఇప్పటికీ స్పందించని నేపధ్యంలో త్వరలోనే చిరంజీవి కూడ పవన్ ‘జనసేన’ వెనుక కీలక శక్తిగా మారబోతున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
pawan kalyan blames chandrababu naidu in cheepurupalli  janasena porata yatra
రేపు నిర్వహించబోతున్న కవాత్ గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాలని జనసేన క్యాడర్ ప్రయత్నిస్తూ అత్యధిక స్థాయిలో జనాన్ని సమీకరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలకు త్రివిక్రమ్ సలహాలతో రూపొందింపబడ్డ ఈ ప్రచార గీతం ‘జనసేన’ కు ఎంత వరకు ఇమేజ్ ని పెంచగలుగుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: