దిల్ రాజ్ నిర్మాతగా ఈ ఏడాది నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ ‘లవర్’ మూవీలు ఫెయిల్ అవ్వడంతో ఆర్ధికంగా దిల్ రాజ్ నష్టపోయాడు అన్న వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా దిల్ రాజ్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో దిల్ రాజ్ మంచి జోష్ లో ఉన్నాడు. 

ఇలాంటి పరిస్థుతులలో నిన్న జరిగిన ‘హలో గురూ ప్రేమకోసమే’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దిల్ రాజ్ వేదిక పై అనుపమ పరమేశ్వరన్ తో కలిసి స్టెప్స్ వేయడం అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా దిల్ రాజ్ కు ‘అరవింద సమేత’ ఊహించని కిక్ ఇచ్చేలా చేసింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఆసక్తి కలిగిస్తున్న ఈ న్యూస్ వివరాలలోకి వెళితే నిన్న జరిగిన ‘హలో గురూ ప్రేమకోసమే’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఉత్సాహంతో ఇలా దిల్ రాజ్ అనుపమతో కలిసి రెచ్చిపోయాడు. 
Hello Guru Prema Kosame pre-release event on Oct 13th
నిన్న జరిగిన ఈ ఫంక్షన్ లో దిల్ రాజ్ చాల ఆత్మస్థైర్యంతో కనిపించడమే కాకుండా ఈసినిమాలో నటించిన రామ్ అనుపమ పరమేశ్వరన్ తదితర నటీనటులను ఉత్సాహ పరుస్తూ నిన్నటి ఈవెంట్ లో అన్నీ తానై వ్యవహరించాడు. దీనికితోడు ఈసినిమా ఫలితం పై దిల్ రాజ్ కు విపరీతమైన నమ్మకం ఉండటంతో ఈమూవీని చాల భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి దిల్ రాజ్ నిశ్చయించుకున్నాడు. 
Ram Hello Guru Prema Kosame Trailer Goes Viral - Sakshi
ఈవారం రాబోతున్న విజయ దశమి రోజుకు ‘అరవింద సమేత’ హడావిడి చాల వరకు తగ్గిపోతుంది అన్న వ్యూహంతో దిల్ రాజ్ చాల ధైర్యంగా ‘హలో గురూ ప్రేమకోసమే’ ను విడుదల చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ అదేవిధంగా అనుపమ పరమేశ్వరన్ ల సినిమాలకు పెద్దగా హిట్ సెంటిమెంట్ లేకపోయినా చాల ధైర్యంగా దిల్ రాజ్ ప్రమోట్ చేస్తున్న ఈమూవీలో ఎదో ఒకటి ఉండి ఉంటుంది అన్న అభిప్రాయంలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: