నిన్న 'అరవింద సమేత' 100 కోట్ల క్లబ్‌ లో చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన సక్సస్ మీట్ లో జూనియర్ చేసిన ఉద్వేగపూరితమైన స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది. త్రివిక్రమ్‌ తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ త్రివిక్రమ్ తనకు 100 రకాలుగా సన్నిహితుడు అంటూ ‘మిత్రుడు ఆత్మీయుడు శ్రేయోభిలాషి అన్న ఆత్మబంధువు మాఅమ్మకు ఇంకో కొడుకు నా పిల్లలకు మావయ్య నాభార్యకు అన్న నాకు బావ’ అని రకరకాల బంధాలతో త్రివిక్రమ్ ను పిలిచి ఏకంగా మాటల మాంత్రికుడుకే షాక్ ఇచ్చాడు.
నా గుండె లోతుల్లో గర్వంగా...
ఇదేసందర్భంలో జూనియర్ మరో ట్విస్ట్ ఇస్తూ ఈమూవీ సక్సస్ తనవిజయం కాదని ఇది త్రివిక్రమ్ విజయం అంటూ ఇలాంటి సినిమాలో నటించినందుకు తనకు చాలగర్వంగా ఉంది అంటూ త్రివిక్రమ్ పై ప్రశంసలు కురిపించాడు. సాధారణంగా ఒకమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆసక్సస్ ను హీరోల ఖాతాలో వేసుకుంటున్న నేపధ్యంలో దానికి భిన్నంగా జూనియర్ నిన్నటిరోజు ‘అరవింద’ సక్సస్ మీడియా మీట్ లో చేసిన కామెంట్స్ జూనియర్ సంస్కారాన్ని సూచిస్తున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 నా ఖాతాలో తోసేశాడు, అది తప్పు...
త్రివిక్రమ్ తో సినిమా చేస్తే జీవితాంతం తనగుండె లోతుల్లో ఆచిత్రం చిరస్థాయిగా మిగిలిపోవాలి అని ఆశించానని అదేవిధంగా ఆసినిమాను తాను గర్వంగా తనపిల్లలకు అదేవిధంగా సమాజానికి గుర్తు ఉండిపోయే సినిమాగా ఉండాలని ‘అరవింద సమేత’ లో నటించాను కానీ రికార్డుల కోసం కాదు అంటూ మరోసారి ఈమూవీ పై తనకు ఉన్న గౌరవాన్ని మరొకసారి బయటపెట్టాడు. తాను త్రివిక్రమ్ ను పూర్తిగా నమ్మాను అనిఅంటూ ఆనమ్మకమే తనకు ఇంత పేరు తెచ్చిపెట్టింది అంటూ మరొకసారి త్రివిక్రమ్ ను ఆకాశానికి ఎత్తేశాడు.
ఆయన ఎంతో గొప్పగా వివరించారు
అరవింద సమేత వీర రాఘవ’ జర్నీలో తాను ఒక భాగం మాత్రమే అని భావిస్తానని ఇది తాను హీరోగా నటించిన సినిమా కాదు అంటూ టోటల్ క్రెడిట్ త్రివిక్రమ్ ఖాతాలోకి జూనియర్ ఇచ్చి వేయడంతో ‘అరవింద సమేత’ దర్శకుడు సినిమాగా మారిపోయింది. ఇలాంటి సినిమా అందించినందుకు అదేవిధంగా ఇలాంటి విజయాన్ని అందించినందుకు త్రివిక్రమ్ తో పాటు అభిమానులకు ప్రేక్షకులకు కూడ తనమాటలతో పాదిభివందనాలు చేసిన జూనియర్ నిన్నటితో అధికారికంగా ‘అరవింద సమేత’ ను త్రివిక్రమ్ మార్క్  మూవీగా మార్చివేశాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: