యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా.. పూజా హగ్దే హీరోయిన్ గా జగపతి బాబు , నవీన్ చంద్ర విలన్ లుగా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, విడుదల తర్వాత కూడా అదే టాక్ రావడం తో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. వాస్తవానికి విడుదలకు ముందు నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Image result for అరవింద సమేత కలెక్షన్లు

అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు టికెట్లన్నీ రెండు రోజుల ముందుగానే అమ్ముడుపోయాయి.   అనుకున్నదాని కంటే భారీగా ఈ చిత్రం వసూళ్లు రాబడుతోంది.  కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్, ఆస్ట్రేలియాలోనూ మంచి వసూళ్లను రాబట్టింది.  మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 26.64 కోట్లు సాధించిన ఈ మూవీ మూడు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 40కోట్ల ఫై చిలుకు షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక నైజాం ఏరియాలో ఇప్పటివరకు రూ. 11.16కోట్ల షేర్ ను సాధించినట్లు సమాచారం. 

aravinda sametha veera raghava us premiere show box office collections report

2018లో నైజాంలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన రెండో చిత్రమిది (నాన్ బాహుబలి ఫిల్మ్). గతంలో ‘అజ్ఞాతవాసి’ అత్యధికంగా రూ.8.13 కోట్లు రాబట్టింది. మరోపక్క ఓవర్సీస్ లో ఇప్పటికే 1.5 మిలియన్ సాధించినట్లు తెలుస్తుంది. దసరా సెలవులు కావడం..ఇక పండుగ ముందు వచ్చే చిత్రాలు హలో గురు ప్రేమకోసమే, పందెం కోడి 2 కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే..కలెక్షన్లపై ఏమైనా  ప్రబావం చూపొచ్చని..లేదంటే..‘అరవింద సమేత’కలెక్షన్లకు అప్పటి వరకు ఢోకా ఉండబోదని సినీ విశ్లేషకులు అంటున్నారు.  ఇదిలా ఉంటే..ప్రస్తుతం ఈ చిత్రం మరో రికార్డును సృష్టించింది. తొలి వారాంతంలోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రంకు ఈ నెల 18 వరకూ పోటీ లేదు. దీంతో ‘అరవింద సమేత’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: