తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి.  తెలుగు చిత్ర పరిశ్రమలో రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇక బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘సమర సింహా రెడ్డి’మూవీతో తెలుగులో ఫ్యాక్షన్ చిత్రాలకు బీజం పడింది. ఆ తర్వాత  ఫ్యాక్షన్ తరహా చిత్రాలు ఎన్నో వచ్చాయి. ‘నరసింహానాయుడు’, ‘సీమ సింహం’ వంటి ఎన్నో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్య సినిమాలు చేసి మంచి సక్సెస్‌లు అందుకున్నాడు.
Image result for aravinda sametha
ఆ తర్వాత చిరంజీవి కూడా ‘ఇంద్ర’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.   ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ బిగినింగ్ లో ‘ఆది’, ‘సాంబ’రాయలసీమ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు..అందులో ఆది మంచి హిట్ కాగా, సాంబ సక్సెస్ అందుకోలేక పోయింది.   15 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ ‘ఆది’ వంటి సీమ నేపథ్య చిత్రం చేసినా రాని విమర్శలు హీరోగా మంచి సక్సెస్ అందుకుంటున్న సమయంలో విమర్శలు వస్తున్నాయి.
Image result for aravinda sametha
ముఖ్యంగా ఎన్టీఆర్‌కు హిట్టు వచ్చిన ప్రతిసారి కావాలనే కొంత మంది ఆయన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన అభిమానులు చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ మూవీలో రాయలసీమలో ఎప్పటి నుంచో ఉన్న ఫ్యాక్షనిజాన్ని చూపించడం తప్పితే..కొత్తగా ఏమి చెప్పలేదన్నారు. అయితే ఈ విమర్శలు పట్టించుకోవద్దని మరికొందరు అంటున్నారు.  మొత్తానికి ‘అరవింత సమేత’ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: