ఈరోజు శరన్నవరాత్రులలో భాగంగా సాధకులు అమ్మవారిని కాళరాత్రి రూపంలో ఆరాధిస్తారు. ఈరోజు అమ్మవారి శరీరం ఘనాంధకార సమంగా పూర్తిగా కాల వర్ణంతో ఉంటుంది. ఈ రోజు అమ్మవారి శిరోజాలు చెల్లాచెదురై ఉంటాయి.

గళశీమలో విద్యుత్ సమంగా భాసిల్లే హారంతో అమ్మవారి త్రినేత్రాలు బ్రహ్మాండ సమంగా గోళాకారంలో కనిపిస్తాయి. ఈమె కళ్ళలోంచి రౌద్రంతో విద్యుత్ సమంగా భాసిల్లే కిరణాలు బయటకు వస్తూ ఆమె రౌద్ర ఆకారాన్ని చూపెడతాయి.

ఈమె నాసిక నుండి ఉచ్చ్వాస నిశ్వాసాల ద్వారా భయంకరమైన అగ్నిజ్వాలలు బయటకు వస్తూ దుర్మార్గులను శిక్షిస్తుంది అని సాధకుల నమ్మకం. కాళరాత్రి దేవి స్వరూపం అత్యంత భయంకరంగా కనిపించినా ఈ రోజు తనను అర్చించే భక్తులకు ఆమె తల్లిగా కరుణ చూపుతుంది.

ఈ రోజు అమ్మవారిని ఈ రూపంలో పూజించే వారికి శత్రు జంతు భయాలు లేకుండా దుష్ట శక్తులు దరికి చేరకుండా అన్నింటా కాపాడుతుందని సాధకుల నమ్మకం. ఈరోజు అమ్మవారిని  మందార పుష్పాలతో పూజించి అమ్మను శాంతియుతంగా ప్రార్ధించాలి. అమ్మను కరుణించమని మనసా వాచా పూజించాలి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర కొబ్బరి బూరెలు నివేదన చేయాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: