ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోకి కాని దర్శకుడుకు కాని విజయాలు వస్తే చాలు వారి వెంటపడుతూ వారు వద్దన్నా వినకుండా వారి చేతిలో వారు తీయబోయే సినిమాలకు సంబంధించి భారీ అడ్వాన్స్ లు ఇచ్చి వారిచేత ఎదోవిధంగా తమ సినిమా చేయించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఏర్పడింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

‘అరవింద సమేత’ సూపర్ సక్సస్ కావడంతో త్రివిక్రమ్ తీయబోయే తదుపరి సినిమా గురించి అప్పుడే ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు మొదలైపోయాయి. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం త్రివిక్రమ్ దగ్గర నిర్మాత దానయ్య దగ్గర నుండి అదేవిధంగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నుండి తీసుకున్న అడ్వాన్స్ లు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. 
Trivikram ..
అయితే త్రివిక్రమ్ మాత్రం తాను తీసే సినిమాలు అన్నీ తన సొంత సంస్థ హారికా హాసినీ సంస్థ పేరు మీద తీస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం త్రివిక్రమ్ పై ఆశ పెట్టుకున్న చాలామంది నిర్మాతల పరిస్థితి ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం బన్నీ హీరోగా త్రివిక్రమ్ సినిమా దాదాపు ఫైనల్ అయినట్లే అని అనిపిస్తూ ఉన్నా మధ్యలో చేంజ్ కొరకు ఒక చిన్న హీరోతో ఒక వెరైటీ సినిమా తన సొంత నిర్మాణ సంస్థ పై తీసి ప్రస్తుతం తనకు ఉన్న క్రేజ్ రీత్యా భారీ లాభాలను కొట్టేయాలని త్రివిక్రమ్ ఆలోచన అని టాక్.
Trivikram Keen on Casting Angry Hero
ఈ నేపధ్యంలో ప్రస్తుతం త్రివిక్రమ్ మనసులో శర్వానంద్ నానీల పేర్లు మెదులుతూ ఉన్నా త్రివిక్రమ్ సన్నిహితుడు నిర్మాత రాధ కృష్ణ మాత్రం అల్లు అర్జున్ తోనే వెళ్ళమని సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో త్రివిక్రమ్ ఇప్పటికే తాను అడ్వాన్స్ లు తీసుకున్న నిర్మాతలకు డబ్బు తిరిగి ఇచ్చి వేస్తాడా లేదంటే వారందరికీ మరికొంత కాలం గడువు పెడతాడా అంటూ ప్రస్తుతం త్రివిక్రమ్ అయోమయ పరిస్థితి పై సెటైర్లు పడుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: