దేశవ్యాప్తంగా జరుతున్న దుర్గా పూజలలో ‘బాహుబలి’ మాహిష్మతి మ్యానియాకనిపించడం సంచలనంగా మారింది.  ‘బాహుబలి’ మూవీకోసం రాజమౌళి సృష్టించిన మాహిష్మతి రాజ్యం సెట్  ను చూసి ఎందరో ఆశ్చర్య పోయారు. మాహిష్మతి ఊహను వెండితెర మీదకు తీసుకువచ్చి తెలుగు సినిమా ప్రేక్షకులను మాత్రమే కాకుండా ప్రపంచ సినిమారంగ ప్రముఖులకు మన తెలుగు వాడి గొప్పతనాన్ని పరిచియం చేసాడు రాజమౌళి.  
Baahubali,Baahubali sets,Baahubali Ramoji Film City
అందుకే రాజమౌళి గొప్పతనానికి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ‘సాహో’ అనడమే కాకునడా ఈ మూవీ విడుదలై ఏడాదిన్నర దాటినా ఇంకా దాని మ్యానియా నుంచి ఇంకా చాలా మంది బయటకు రాలేకపోతున్నారు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు మన సౌత్ లోనే కాకుండా ముఖ్యంగా వెస్ట్  బెంగాల్ లో పాటు ఆ రాష్ట్రానికి చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలలో కూడా అత్యంత ఘనంగా చేస్తారు. 

ప్రతిచోట ఒక మండపంలో  దుర్గా మాత విగ్రహం పెట్టి మనం గణేష్ ఉత్సవాలు చేసే విధంగా   చేస్తారు.  ఇలాంటి పరిస్థితులలో  త్రిపురలోని అగర్తలాలో ‘బాహుబలి’ మండపం ఒకటి తయారు చేయడం ఇప్పుడు మీడియా కు హాట్ టాపిక్ గా మారింది.  మాహిష్మతి కోట లాగే  ఉండే దేవి మండపం రెడీ చేసి అందులో దుర్గా మాత విగ్రహాన్ని పెట్టారు.  
Baahubali
కేవలం కోట మాత్రమేకాకుండా    భారీ సైజులో    ఏనుగులబొమ్మలు  కూడా పెట్టారు. ఈ మండపం  నిర్వహిస్తున్న  నేతాజీ ప్లే ఫోరం సెంటర్ వారు ఈ మాహిష్మతి సెట్ ఎందుకు వేయాల్సి వచ్చిందో కూడా తెలిపారు.  దుర్గామాత పూజకు ‘బాహుబలి’ సెట్ వేయాలని అగర్తాలోని ప్రజలు తమను కోరారు అని చెప్పడంతో ఎన్ని సంవత్సరాలు గడిచినా ‘బాహుబలి’ మ్యానియా నుండి జనం బయటకు రాలేక పోతున్నారు అన్న విషయం మరోసారి నిజం అయింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: