రామ్ చరణ్ బోయపాటి శ్రీనుల మూవీ ఫస్ట్ లుక్ దసరా రోజు విడుదల అవుతుందని అందరు భావించారు. దసరా వెళ్లి పోతోంది కాని ఈమూవీ ఫిస్ట్ లుక్ విడుదల కాక పోవడంతో చరణ్ అభిమానులు తీవ్ర నిరాశకు లోను అవుతున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు  'వినయ విధేయ రామ' టైటిల్‌ ఓకే అయిపోయిందని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా రెడీ అయిందని వార్తలు హడావిడి చేసిన విషయం తెలిసిందే. 
Ram Charan - Boyapati Srinu's Film heading to Europe
తెలుస్తున్న సమాచారం మేరకు ఈ  టైటిల్‌ బోయపాటికి బాగా నచ్చడంతో  మెగా ఫ్యాన్స్‌ ఫీడ్‌ బ్యాక్‌ కోసమని మీడియాకి ముందుగా లీక్‌ చేసారు అని తెలుస్తోంది. అయితే ఈ టైటిల్‌ చిరంజీవికి ఏమాత్రం నచ్చలేదు అని టాక్. అంతేకాదు ఈ మూవీ మాస్‌ సినిమా అయినప్పటికీ  కావాలని క్లాస్‌ అప్పీల్‌ కోసం తాపత్రయ పడుతున్నట్టుఉంది అని చిరంజీవి  బోయపాటి వద్ద కామెంట్స్ చేసినట్లు టాక్.
 ram-charan-boyapati-sreenu-kiara-advani-movie-launch-1
అంతేకాదు మూవీ టైటిల్ క్యాచీ గా లేకపోతే  ఎంత భారీ సినిమా  అయినప్పటికీ ఆసినిమాపై ఆసక్తి పెరగదు అని చిరంజీవి బోయపాటితో కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో  మళ్లీ కొత్త టైటిల్‌ కోసం బోయపాటి ఆలోచనలో పడిన నేపధ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ను వచ్చేనెల రాబోతున్న దీపావళికి విడుదల చేయాలని బోయపాటి ఆలోచన అని అంటున్నారు. 
Ram Charan Boyapati New Movie Updates 
ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదల డేట్ జనవరి 11 అని ఫిక్స్ అయినప్పటికీ  ఇంకా మరో ముపై రోజులు షూటింగ్ పెండింగ్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నూట అయిదురోజుల వరకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరిగినా  ఇంకా  ముపై రోజులు   షూటింగ్ పెండింగ్ లో  ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. బ్యాంకాక్ నుంచి విశాఖ దాకా డైరక్టర్ బోయాపాటి తన సెంటిమెంట్ లొకేషన్లు అన్నీ టచ్ చేసుకుంటూ షూట్ చేస్తున్న నేపధ్యంలో  బోయపాటి ఈ  మూవీ పెట్టిస్తున్న  ఖర్చు ఇప్పటికే   వందకోట్లు దాటి పోవడంతో నిర్మాత దానయ్య తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు టాక్. దీనితో ఈ సినిమా పరిస్థితి ఏమిటి అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. . 



మరింత సమాచారం తెలుసుకోండి: