రామ్ గోపాల్ వర్మ నాస్థికుడు దేవుడి అవతారాల పై సెటైర్లు వేసి న్యాయస్థానాల చేత వార్నింగ్స్ తెచ్చుకున్న వర్మ ఇప్పుడు ఏకంగా భక్తుడుగా మారిపోయి దసరా రోజు తన కుటుంబ సభ్యులతో చిత్తూరి జిల్లా కాణీపాకం ఆలయంలో నినాయకుడుని దర్శించుకుని పూజలు కూడ చేయడం ఆ ఆలయ అధికారులకే షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ఈరోజు ఉదయం వర్మ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ స్వామి ఆశీర్వాదాలు పొందడం మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది అంతా తాను తీయబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి అని చెపుతున్నాడు వర్మ. 
ఎన్టీఆర్ జీవితంలోని వివాదాలుంటాయా?
ఈవిషయాలకు సంబంధించి వర్మ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘నాస్తికుడినైన నేను నా జీవితంలో మొట్టమొదటి సారిగా అక్టోబర్ 19 పొద్దున్న 6 గంటలకి తిరుపతి లో బాలాజీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం 4 గంటలకి తిరుపతి శిల్పారామంలో ప్రెస్ మీట్ పెట్టి ‘లక్ష్మి'స్ ఎన్టీఆర్’ వివరాలు చెప్పబోతున్నాను''  అంటూ తన మూవీ ప్రమోషన్ కు ఏకంగా ఈసారి దేవుళ్ళనే వాడుకుంటున్నాడు వర్మ.  
Ram Gopal Varma
దీనితో ఈరోజు సాయంత్రం జరగబోతున్న ప్రెస్ మీట్ లో ఈసినిమాకు సంబంధించి ఎటువంటి సంచలన విషయాలు వర్మ బయట పెట్టబోతున్నాడు అంటూ మీడియా వర్గాలలో ఆసక్తి విపరీతంగా పెరిగి పోయింది. లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్ జీవితం గురించి తీయబోతున్న ఈమూవీలో అత్యంత సంచలన విషయాలకు సంబంధించిన వాస్తవాలను చూపెడతాను అని అంటున్నాడు వర్మ. 
Ram Gopal Varma
ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి అచ్చం చంద్రబాబును పోలిన వ్యక్తిని వర్మ కనిపెట్టి అతడి విషయాలను లీక్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్ర కోసం ఇప్పటికే వర్మ ముగ్గురుని సెలెక్ట్ చేసి వారి మేకప్ టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవే అయినా ఎన్టీఆర్ చివరి దశలో జరిగిన వెన్నుపోటు సంఘటనను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. మరి అలాంటి విషయాలను ధైర్యంగా వర్మ చూపెదతాడా లేదంటే పబ్లిసిటీ హడావిడితోనే ఈమూవీని  ఎవరికీ అర్ధం కాకుండా తీసి తన నైజం మరొకసారి బయటపెట్టుకుంటాడా అన్న విషయం రానున్న రోజులలో తేలిపోతుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: