రాజమౌళి మల్టీ స్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ ఇంకా ప్రారంభం కాకుండానే ఆమూవీ నిర్మాత డివివి దానయ్యకు 100 కోట్లు పోగొట్టుకునేలా చేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈమూవీ ప్రాజెక్ట్ ను తమకు పూర్తిగా అప్పచెప్పి తనకు తానుగా తప్పుకుంటే దానయ్యకు 100 కోట్లు ఇస్తామని ‘బాహుబలి’ నిర్మాతలు దేవిప్రసాద్ శోభూ యార్లగడ్డ లు  ఇచ్చిన ఆఫర్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఈ సినిమాకు సంబంధించి పూర్తిగా నటీనటుల ఎంపిక కూడ జరగకపోయినా ప్రారంభోత్సవం కూడ జరుపుకొని ఈమూవీ ప్రాజెక్ట్ పై వచ్చిన 100 కోట్ల లాభాన్ని దానయ్య వదులుకోవడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రాజమౌళితో సినిమా తీయాలి అని కలలు కంటున్న దానయ్య ఆత్మవిశ్వాసం ఈభారీ ఆఫర్ ను రిజక్ట్ చేసేలా చేసింది అనుకోవాలి. 
#RRR - Rajamouli busy scouting interesting locales
ఇప్పటికే టాప్ హీరోలందరితోను సినిమాలు తీస్తున్న దానయ్య ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ కోసం ఎంత భారీ మొత్తాన్ని అయినా పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్న నేపధ్యంలో ‘బాహుబలి’ నిర్మాతలు ఇలాంటి భారీ ఆఫర్ ను దానయ్యకు ఆఫర్ చేయడం వెనుక ఎదో ఒక కోణం ఉంది అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈసినిమాను ఎట్టి పరిస్తుతులలోను నవంబర్ నుండి ప్రారంభించాలని రాజమౌళి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఇంకా చరణ్ బోయపాటి ప్రాజెక్ట్ నుండి బయటకు రాకపోవడంతో రాజమౌళి యాక్షన్ ప్లాన్స్ మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 
five years for baahubali, 1.5 years for rajamouli's rrr?
దీనికితోడు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ ను ఎప్పుడు మొదలుపెట్టి మరెప్పుడు పూర్తి చేస్తాడో అతడికే క్లారిటీ లేని నేపధ్యంలో ఒక విధంగా దానయ్య తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతం అయినది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ఈ ప్రాజెక్ట్ ను ఇప్పటి వరకు డిజైన్ చేసింది దానయ్య అయితే మధ్యలో ‘బాహుబలి’ నిర్మాతల ఒత్తిడి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: