దసరాకు విడుదలైన ‘హలో గురూ ప్రేమకోసమే’ మూవీకి డివైడ్ టాక్ రావడంతో దిల్ రాజ్ సినిమాలకు హ్యాట్రిక్ పరాజయం వచ్చినట్లు అయింది. సినిమాల కథల ఎంపిక విషయంలో చాల జాగ్రత్తలు తీసుకునే దిల్ రాజ్ ఈ సంవత్సరం నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ ‘లవర్’ ‘హలో గురూ ప్రేమకోసమే’ సినిమాలు మూడు పరాజయం అయినా లెక్క చేయకుండా దిల్ రాజ్ నిర్మించే సినిమాల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. 
Samantha Parents Anger on Media
ఇలాంటి పరిస్థుతులలో దిల్ రాజ్ త్వరలో నిర్మించబోయే ‘96’ తమిళ రీమేక్ గురించి సమంత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతనెల విడుదలైన ‘96’ తమిళంలో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని దిల్ రాజ్ చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. 
సినిమాల నుంచి తప్పుకోవాల్సి వస్తే..
వాస్తవానికి ‘96’ మూవీలో త్రిష చేసిన పాత్రను సమంత చేత నటింప చేయాలని దిల్ రాజ్ చాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ వార్తల పై పరోక్షంగా స్పందించింది సమంత.  ‘96’  లాంటి రియాలిటీ సినిమాలను తెలుగులో రీమేక్ చేయకుండా వాటిని టచ్ చేయకపోవడమే మంచిది అంటూ సమంత కామెంట్స్ చేసింది. 
Samantha Akkineni
దీనితో ఆ సినిమాను రీమేక్ చేయద్దని సమంత ఇన్ డైరెక్ట్ గా దిల్ రాజ్ కు సలహాలు ఇస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమంత ఎంతో కష్టపడి ‘యూటర్న్’ సినిమాలో నటించినా ఆసినిమా ఆర్ధికంగా విజయం సాధించలేని నేపధ్యంలో సమంత బాధతో ఇలాంటి సలహాలను దిల్ రాజ్ కు ఇస్తోంది అనుకోవాలి. అయితే ఎంతో దైర్యంగా సినిమాలు తీసే దిల్ రాజ్ సమంత మాటలను ఎంతవరకు గౌరవిస్తాడో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: