చిరంజీవి మేనల్లుడిగా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కేవలం మెగా అభిమానుల అండ పైన మాత్రమే ఆధార పడకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఎర్పరుచుకోవడమే కాకుండా తన అభిమానులుగా ఒకప్రత్యేకమైన వర్గాన్ని ఏర్పరుచుకుని కొన్నిసందర్భాలలో ఏకంగా మెగా కాంపౌండ్ కు షాక్ ఇచ్చిన సంధర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పడు ఇదిచాలదు అన్నట్లుగా గీతాఆర్ట్స్ నీడ నుంచి అల్లు అర్జున్ బయటకు వస్తున్నాడా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. 
Naa Peru Surya Naa Illu India stars allu arjun
గీతాఆర్ట్స్ సంస్థకు చాలపెద్ద భవంతి ఉండగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆఫీసును ఏర్పరుచుకోవడమే కాకుండా ఆ ఆఫీస్ లుక్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బన్నీ లీక్ చేయడం వెనుక పెద్దపెద్ద వ్యూహాలు ఉన్నాయి అని అంటున్నారు. ఈఆఫీసులో అల్లు అర్జున్ తరుచు దర్శకులు ఇంద్రగంటి ప్రవీణ్ సత్తారు చందుమొండేటి మారుతిలు చెపుతున్న కథలు వింటూ ఆకథలలో తనకు నచ్చిన కొన్నికథలను డెవలప్ చేయమని బన్నీ చెప్పినట్లుగా వస్తున్న వార్తలను బట్టీ అల్లు అర్జున్ ఇన్ని సినిమాలలో నటిస్తున్నాడా అని సందేహాలు కలగడం సహజం.
Allu Arjun in Naa Peru Surya
అయితే ఈసినిమాలలో బన్నీ నటించకుండా వాటిని వరసగా నిర్మించి తన బ్యానర్ ను పెద్ద బ్యానర్ గా చేయాలి అన్న ఆలోచనలలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  ముఖ్యంగా తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు తీసి తన ప్రొడక్షన్ హౌస్ కు భారీ లాభాలు వచ్చే విధంగా బన్నీ ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు. 
Allu Arjun
అయితే తనతండ్రి అల్లు అరవింద్ కు గీత ఆర్ట్స్ కు సంబంధించిన రెండు ప్రొడక్షన్ హోస్ లు ఉండగా వాటి వ్యవహారాలు చూసుకునే సామర్ధ్యం అరవింద్ తో పాటు బన్నీ సోదరులకు కూడ ఉన్న నేపధ్యంలో ఇప్పుడు ఇలా అల్లు అర్జున్ ఎందుకు తన సొంత నిర్మాణ సంస్థ వైపు అడుగులు వేస్తున్నాడు అన్న విషయమై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. గీత ఆర్ట్స్ సంస్థ అంటే అన్నదమ్ముల వ్యవహారం కాబట్టి ఆదశగా వెళ్ళకుండా అన్నీ తానై వ్యవహరించే ఒక ప్రత్యేకమైన నిర్మాణసంస్థ ఆలోచనలలో అల్లు అర్జున్ ఇలా తన సొంత నిర్మాణసంస్థ వైపు అడుగులు వేస్తున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: