కమలహాసన్ తమిళ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఒక సొంత పార్టీని ఏర్పాటు చేసి ఇప్పటికే జనం మధ్యకు వెళ్లి ప్రచారం చేస్తూ ఉన్నా తనకు ఇమేజ్ ని తెచ్చిపెట్టిన ఫిలిం ఇండస్ట్రీని వదలకుండా ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు తమిళ బుల్లితెర షో ‘బిగ్ బాస్’ కు రెండు సీజన్స్ నుండి హోస్ట్ గా వ్యవహరిస్తూ తన ఇమేజ్ ని కాపాడుకుంటూనే ఉన్నాడు. 
కమల్ హాసన్
ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా కమల్ శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన తన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్ గా ‘భారతీయుడు-2’ మూవీకి లైన్ క్లియర్ చేసి ఆమూవీ షూటింగ్ ను వచ్చేనెల నుండి ప్రారంభించబోతున్నాడు. ప్రస్తుతం వర్తమాన రాజకీయాలను టార్గెట్ చేస్తూ ‘భారతీయుడు 2’ ఉండబోతోంది అని టాక్. 
Kamal Hasan
తన రాజకీయ పార్టీ సిద్ధాంతాలను జనం మధ్యకు తీసుకువెళ్ళడానికి కమల్ ఈ ‘భారతీయుడు 2’ ను ఒక అస్త్రంగా మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈమూవీలోని తన పాత్ర కోసం కమలహాసన్ తన 60 సంవత్సరాల వయస్సులో 15 కిలోల బరువు తగ్గడానికి ఒక స్పెషల్ ట్రైనర్ ను పెట్టుకుని కమల్ ప్రస్తుతం వ్యాయామం చేస్తున్నట్లు సమాచారం. 
'Kshatriya Putrudu' sequel confirmed by Kamal - Sakshi
హడావిడి చేస్తున్న ఈవార్తలు పవన్ అభిమానుల వరకు చేరడంతో పవన్ కూడ రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లోపు తన ‘జనసేన’ సిద్ధాంతాలను వివరిస్తూ ఒక పొలిటికల్ మూవీలో నటిస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సినిమాల పై ఏమాత్రం మనసు పెట్టలేని స్థితిలో ఉన్న పవన్ కమలహాసన్ వ్యూహాలను అనుసరిస్తూ అడుగులు వేస్తే రాబోతున్న ఎన్నికలలో ‘జనసేన’ కు ఫలితాలు ఎలా ఉన్నా పవన్ టాలీవుడ్ ఇండస్ట్రీ స్థానాన్ని చెదర నీయకుండా ఉంచగలుగుతుంది. అయితే ఇలాంటి కామెంట్స్ ఎంతవరకు పవన్ మనసును మార్చగలవా అన్నదే సందేహం..  


మరింత సమాచారం తెలుసుకోండి: