బోయపాటి రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ టైటిల్ ప్రకటన గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఈసినిమాను అనుకున్న డేట్ కు విడుదల కాకుండా కొందరు వెన్నుపోటు రాజకీయాలు ప్రయోగిస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న గాసిప్పులు అత్యంత సంచలనంగా మారాయి. ఇలా ఈసినిమాకు సంబంధించి గాసిప్పులు రావడానికి దర్శకుడు బోయపాటి కారణం అని అంటున్నారు. 
Photos: Ram Charan’s film with Boyapati Srinu goes on floors
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈమూవీ పూర్తి కావడానికి ఇంకా కనీసం 30 రోజుల షూటింగ్ వర్కింగ్ డేస్ కావాలి అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యలో రామ్ చరణ్ వచ్చేనెలలో రెండు వారాల పాటు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన వర్క్ షాప్ కు వెళ్ళవలసిన పరిస్థితి. దీనితో ఈమూవీ షూటింగ్ కు బ్రేక్ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
Ram Charan’s new look for his next movie in Boyapati Srinivas direction goes viral
దీనికితోడు ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ కూడ ఇంకా పూర్తి కాలేదు అని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈ సినిమా పాటల రికార్డింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడు ఆ పాటల చిత్రీకరణ జరుగుతుంది అంటూ ఇండస్ట్రీలో అనేకమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  సంక్రాంతి రేసుకు రాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ కు ఎటువంటి పెద్ద హీరోల సినిమాల పోటీ లేకుండా చూడాలి అన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు రాయబారాలు నడుపుతున్న నేపధ్యంలో ఈ రాయబారాలు ఈసినిమాను నిర్మిస్తున్న నిర్మాత దానయ్యతో కూడ చేసినట్లు టాక్. 
Ram Charan trains hard to get in shape for his next film with Boyapati Srinu
అయితే దానయ్య చరణ్ మూవీ ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల అవుతుంది అని చెపుతున్నప్పటికీ వాస్తవ పరిస్థుతులు వేరుగా ఉన్న నేపధ్యంలో బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన బోయపాటి పరోక్షంగా చరణ్ సినిమాను రకరకాల కారణాలతో ఆలస్యం చేస్తూ బాలయ్యకు సహకరిస్తున్నాడా అన్న అనుమానాలు గాసిప్పులుగా హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న బోయపాటి ఇలా ఒక వర్గానికి సహాయం చేస్తూ మెగా కాంపౌండ్ కు అన్యాయం చేసే ధైర్యం చేయలేదని ఎవరో కావాలని బోయపాటి పై నిందలు వేయడానికి ఇలాంటి గాసిప్పులను ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు అంటూ బోయపాటి సన్నిహితులు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్..     


మరింత సమాచారం తెలుసుకోండి: