తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ‘మహానటి’చిత్రాన్ని తెరకెక్కించారు.   ఈ చిత్రం అనుకున్నదానికన్నా రెట్టింపు విజయం సాధించి కలెక్షన్లు కూడా బాగా రాబట్టింది.  తాజాగా తెలుగు ఇండస్ట్రీ మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘ఎన్టీఆర్’బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.  క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 
ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మరో లుక్ విడుదల
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నట్లు ఈ మద్య పోస్టర్స్ రిలీజ్ చేశారు దర్శకులు.  ఎన్టీఆర్ నట జీవితానికి సంబంధించిన కథతో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఆయన రాజకీయ నేపథ్యంలో వచ్చేది ‘ఎన్టీఆర్ మహానాయకుడు’.  ఈ రెండు చిత్రాలు పదిహేను రోజులో గ్యాప్‌లో రిలీజ్ చేయనున్నారు.ఒక పార్ట్‌లో ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని...మరో పార్ట్‌లో రాజకీయ జీవితాన్ని చూపించబోతున్నారు.
Image result for ntr biopic
ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు  చంద్రబాబుగా రానా..అక్కినేనిగా ఆయన మనవడు సుమంత్..శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, బసవతారకం గా విద్యాబాలన్, నందమూరి హరికృష్ణ గా కళ్యాన్ రామ్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  తాజాగా చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  ఈ పాత్రలో భరత్ రెడ్డి నటిస్తున్నాడు.
Image result for ntr biopic
నేడు భరత్ రెడ్డి పుట్టినరోజు కాగా, ఈ సందర్భంగా ఈ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో పలు ముఖ్య పాత్రలను టాలీవుడ్ ప్రముఖ నటీనటులు పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఒక్కో లుక్‌ రిలీజ్‌తో ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: