టాప్ హీరోల సినిమాలకు ఏఒక్క నెగిటివ్ సెంటిమెంట్ ప్రచారంలోకి వచ్చినా ఆ నెగిటివ్ సెంటిమెంట్ ఆమూవీ మార్కెట్ పై తీవ్రప్రభావాన్ని చూపెడుతుంది. మహేష్ నటిస్తున్న ‘మహర్షి’ సినిమాకు ఇలాంటిపరిస్థితి ఎదురైంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం టాప్ హీరోలు అంతా సంవత్సరానికి ఒక సినిమా విడుదల చేయడం కష్టమైపోతున్న నేపధ్యంలో ప్రస్తుత తరం టాప్ హీరోలు కనీసం 50 సినిమాలు పూర్తి చేస్తారు అన్నగ్యారెంటీ లేదు.
Maharshi: All Set for Long US Schedule
ఇలాంటి పరిస్థుతులలో ఒక టాప్ హీరో 25 సినిమాలు పూర్తి చేయడమే పెద్ద రికార్డ్ గా మారిపోయింది. దీనితో ఒకటాప్ హీరోకి సంబంధించి 25వ సినిమా అంటే ఆమూవీ పై విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే అంచనాలను అందుకోవడంలో టాప్ హీరోల 25వ సినిమా తరుచూ బోల్తా పడుతోంది. ఈసంవత్సరం విడుదలైన ‘అజ్ఞాతవాసి’ పవన్ కెరియర్ కు సంబంధించి 25వ సినిమాగా ల్యాండ్ మార్క్ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నప్పటికీ ఆమూవీ అత్యంత ఘోరమైన ఫ్లాప్ గా మారింది. 

అదేవిధంగా జూనియర్ కు సంబంధించిన 25వ మూవీ ‘నాన్నకు ప్రేమతో’ కు ప్రశంసలు లభించాయి కానీ కలక్షన్స్ పరంగా ఆమూవీ పెద్దగా సంచలనాలు సృష్టించ లేకపోయింది. ఇక లేటెస్ట్ గా విడుదలైన విషాల్ ‘పందెం కోడి 2’ విషాల్ కెరియర్ కు సంబంధించి 25వ సినిమా అయినప్పటికీ ఆమూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. అదేవిధంగా యంగ్ హీరో నితిన్ నటించిన 25వ సినిమా ‘ఛల్ మోహన్ రంగా’ కూడ ఫ్లాప్ కావడంతో టాప్ హీరోలకు 25వ సినిమా కలిసిరావడం లేదు అన్నప్రచారం ఇండస్ట్రీ వర్గాలలో మొదలైంది. 
Exclusive: Mahesh Babu’s Maharshi Film In Rural Backdrop!
దీనితో ఈమూవీని అత్యంత భారీ రేట్లకు కొనాలి అని ఉత్సాహ పడుతున్న బయ్యర్లు ఈ నెగిటివ్ సెంటిమెంట్ వార్తలు విని కొద్దిగా వెనుకడుగు వేస్తున్నట్లు టాక్. అయితే ఈ ప్రచారం అంతా మహేష్ వ్యతిరేక వర్గం ‘మహర్షి’ సినిమాను దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నాలలో భాగమని ఈమూవీ మహేష్ కెరియర్ లోనే ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోవడం ఖాయం అంటూ ఈమూవీ నిర్మాతలు బయ్యర్లకు ధైర్యం చెపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: